సినిమా

Ajith-Venkatesh: తెలుగు, తమిళ సీనియర్ హీరోల క్రేజీ మల్టీస్టారర్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Ajith-Venkatesh: సౌత్ సినిమా ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లోనూ మల్టీస్టారర్ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మరీ, ముఖ్యంగా రెండు భాషలలో హీరోలు గనక సినిమా చేస్తే ఆ అడ్వాంటేజ్ వేరే లెవల్. రెండు భాషలలోనూ మంచి బిజినెస్ అవుతుంది. ఇక, ఈ మధ్యకాలంలో ఇటు తెలుగులో, అటు తమిళంలో వచ్చిన మల్టీస్టారర్స్ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించాయి.

Ajith-Venkatesh: సౌత్ సినిమా ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లోనూ మల్టీస్టారర్ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మరీ, ముఖ్యంగా రెండు భాషలలో హీరోలు గనక సినిమా చేస్తే ఆ అడ్వాంటేజ్ వేరే లెవల్. రెండు భాషలలోనూ మంచి బిజినెస్ అవుతుంది. ఇక, ఈ మధ్యకాలంలో ఇటు తెలుగులో, అటు తమిళంలో వచ్చిన మల్టీస్టారర్స్ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించాయి.

అజిత్-వెంకీ కాంబోలో క్రేజీ మల్టీస్టారర్:

తమిళ సీనియర్ హీరో అజిత్ కుమార్, టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కలిసి ఓ సినిమాను చేయబోతున్నట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో బాగా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఇటీవల, అజిత్ హీరోగా "డేర్ డెవిల్" అనే సినిమాను ప్రకటించారు. త్వరలో, ఈ సినిమా సెట్స్‌పైకి రాబోతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో వెంకీ ఓ కీలక పాత్రను చేయనున్నాడట.

అజిత్, కోలీవుడ్ లో వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవల 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో వచ్చి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీనికి, అజిత్ ఫ్యాన్ బాయ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. వీరి కాంబోలో రాబోతున్న రెండవ సినిమా. ఇక, అజిత్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అలాగే, వెంకటేష్‌కి తమిళంలో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే రెండు రాష్ట్రాలలో బాక్సులు బద్ధలే.

మల్టీస్టారర్ అంటే ముందుండే వెంకీ..

మన సీనియర్ హీరోలలో వెంకటేష్ ఒప్పుకున్నన్ని మల్టీస్టారర్ సినిమాలు మరో హీరో చేయలేదు. ఇప్పటికే, సూపర్ స్టార్ మహేష్ తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'గోపాల గోపాల', రామ్ తో 'మసాలా'.. వరుణ్ తేజ్ తో 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' లాంటి మల్టీస్టారర్లలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే హిందీలోనూ సల్మాన్ ఖాన్‌తో కలిసి 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' మూవీలో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు, తమిళ హీరో అజిత్‌తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలో, అధికారికంగానూ ప్రకటించనున్నారు.

#anithkumar#venkatesh#adhikravichandran#kollywood#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి