సినిమా

NTR: ఎన్టీఆర్ కార్యాలయం అధికారిక ప్రకటన..12న సర్జరీ..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

NTR: ఎన్టీఆర్ కార్యాలయం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 12న (బుధవారం) సర్జరీ చేయనున్నట్టుగా ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశారు. ఇటీవల, ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో, భుజానికి గాయం అయింది. దాంతో, షూటింగ్ స్పాట్ నుంచి ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశారు. ఈ నేపథ్యంలో, పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ అవసరం అని సూచించారు. ఇక, తాజాగా ఆయన భుజానికి ఆగస్టు 12న అర్జరీ చేయనున్నట్టు ప్రకటించారు.

సర్జరీ తర్వాత పూర్తిగా తారక్ ఎన్ని వారాలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందో డాక్టర్లు వెల్లడించనున్నారు. ఇక, ఈ సర్జరీ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో వైద్య బృందం సమక్షంలో జరగనుంది. ఇటీవల, కాలంలో మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఇలా గాయాలపాలైన వారిలో నందమూరి బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఉన్నారు.

ఇక, ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ, యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ థీమ్ మాత్రమే కాకుండా, డ్రాగన్ లో ఈసారి కలర్ ఫుల్ సెట్స్ కూడా ఉండబోతున్నాయి. ఇక, ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది.

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాల్సిన గాడ్ ఆఫ్ వార్ చిత్రీకరణ మరింత ఆలస్యం కానుందని ఇటీవల ఓ న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. సుబ్రమణ్య స్వామీ కథతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఉండబోతోంది. 2027 సెకండాఫ్ లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ మొదలు పెట్టి అదే ఏడాది చివరి నుంచి సెట్స్‌పైకి తీసుకువచ్చే ప్లాన్‌లో చిత్రబృందం ఉంది.

#ntr#ntrhealthupdate#dragon#prahanthneel#rukminivasanth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి