Rukmini Vasanth: ప్రస్తుతం సౌత్ భాషలలో బాగా అవకాశాలను అందుకుంటున్న బ్యూటీ రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాచేయెల్లో అనే మూవీతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన రుక్మిణీ వసంత్, తెలుగులో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో" అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తర్వాత, తమిళంలో శివ కార్తికేయన్ నటించిన 'మదరాసి' సినిమాలో హీరోయిన్‌గా చేసింది.
అయితే, తెలుగు, తమిళ సినిమాలలో నటించిన రుక్మిణికి రెండు ఫ్లాప్‌గా మిగిలాయి. కానీ, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన 'కాంతారా చాప్టర్ 1' తో మాత్రం సాలీడ్ హిట్ అందుకుంది. ఆ తర్వాత, నుంచి ఈ బ్యూటీకి వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.
మలయాళ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ:
రుక్మిణి వసంత్ కి మలయాళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. తాజాగా, ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయిన విషయాన్ని స్వయంగా రుక్మిణి..క్లాప్ బోర్ట్ పట్టుకొని ఉన్న పిక్‌ని తన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ద్వారా ప్రకటించింది. మలయాళ క్రేజీ హీరో నివిన్ పౌలీ సరసన హీరోయిన్ అవకాశం అందుకొని మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇక, కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' మూవీలోనూ రుక్మిణి ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఇటీవల, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను బెంగుళూరులో ఘనంగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కి హాజరైన రుమిణి, 'టాక్సిక్' మూవీలో పాత్ర గురించి, హీరో యష్ గురించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి, ఒక్క 'కాంతార 1' హిట్‌తో తెలుగు-తమిళం-కన్నడ-మలయాళ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటోంది.












