తెలంగాణ

KTR: ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీకి రూ.200కోట్ల విలువైన భూమి.. భారీ స్కామ్ జరిగిందన్న కేటీఆర్

రచన: NK••4 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ తన సోదరులకు రాష్ట్రాన్ని రాసి ఇచ్చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీకి, లక్ష రూపాయల మూలధనం మాత్రమే ఉన్న కంపెనీకి ఛైర్మన్ గా అనుముల కొండల్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఆ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం ఏకంగా 200 కోట్ల రూపాయల విలువ చేసే 5 ఎకరాల భూమిని కేటాయించిందని కేటీఆర్ చెప్పారు.

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ తన సోదరులకు రాష్ట్రాన్ని రాసి ఇచ్చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీకి, లక్ష రూపాయల మూలధనం మాత్రమే ఉన్న కంపెనీకి ఛైర్మన్ గా అనుముల కొండల్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఆ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం ఏకంగా 200 కోట్ల రూపాయల విలువ చేసే 5 ఎకరాల భూమిని కేటాయించిందని కేటీఆర్ చెప్పారు.

కొండల్ రెడ్డి కంపెనీకి అంత విలువైన భూమి కేటాయించి రేవంత్ సర్కార్ అతి పెద్ద స్కామ్ కి పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశాన్ని వదిలేది లేదని, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని తేల్చి చెప్పారు. కాగా భూ కేటాయింపులకు, సీఎం రేవంత్ సోదరుడికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

''రాష్ట్రం అనుముల సోదరుల సామ్రాజ్యం అన్నట్లుగా మారింది. అనుముల కొండల్ రెడ్డి టెసరాక్ కంపెనీ ఛైర్మన్ అని లింక్ డిన్ ప్రొఫైల్ లో పెట్టుకున్నారు. చదువు రాని సీఎం సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారు. ఒక్క ఉద్యోగి కూడా లేకుండా కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేశారు. చిన్న చిన్న ఇంటి అడ్రస్ లతో పెద్ద పెద్ద కంపెనీలు రిజిస్ట్రర్ చేయించారు. ఊరు పేరు లేని కంపెనీలకు రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి ఇచ్చారు.

రేవంత్ రెడ్డి మరో సోదరుడు జగదీశ్ రెడ్డి మరో కాంట్రాక్ట్ చేసుకున్నారు. సీఎం రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్టులు ఇచ్చారు. కొండల్ రెడ్డికి కోట్ల విలువైన స్థలాన్ని గజం 750 రూపాయల చొప్పున కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూకేటాయింపులు వదిలేది లేదు. సీఎం అల్లుడి ఫార్మా కంపెనీ కోసం కొడంగల్ గిరిజనుల భూములు లాక్కున్నారు. ముఖ్యమంత్రి కుటుంబం అంతా దోపిడీ చేస్తుంటే మంత్రులు వంత పాడుతున్నారు. తిరుపతి రెడ్డి కనీసం వార్డు సభ్యుడు కాదు.. ఆయనకు ప్రోటోకాల్ ఇస్తున్నారు. మంత్రి పొంగులేటి కుమారుడికి వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు'' అని కేటీఆర్ అన్నారు.

#Ktr#Brs#Land Scam#Cm Revanth Reddy#Swechaa News#Kondal Reddy Anumula#Tesseract Advanced Systems
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి