Keerthy Suresh: అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌కు ఇప్పుడు ఏ సినిమా చేసినా పెద్దగా కలిసి రావడం లేదు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత చేసిన సినిమాలతో మాత్రం అదే స్థాయి విజయాలు దక్కడం లేదు. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కీర్తికి ఆశించిన సక్సెస్ రావడం లేదు. తాజాగా భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అక్క’ సిరీస్ కూడా మరోసారి నిరాశనే మిగిల్చింది అంటున్నారు.
మిగతా హీరోయిన్స్ మాదిరిగానే కీర్తి సురేష్ కూడా సౌత్‌లో మంచి క్రేజీ హీరోయిన్‌గా నిలబడింది. దీంతో, బాలీవుడ్‌లో అడుగుపెట్టాలన్న కీర్తి ప్రయత్నాలకు కూడా మొదట్లో ఆశించిన అవకాశాలు రాలేదు. అయినా, ఎట్టకేలకి వరుణ్ ధావన్ సరసన నటించిన ‘బేబీ జాన్’ సినిమాలో ఛాన్స్ అందుకుంది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో హిందీలో క్రేజీ హీరోయిన్‌గా పాపులార్ అవ్వాలనుకున్న కీర్తి ప్రయత్నానికి బ్రేక్ పడినట్లయింది. అయినా కూడా, భాషతో సంబంధం లేకుండా మంచి కథలు, పాత్రలను ఎంచుకుంటోంది.
‘అక్క’తో అయినా అదృష్టం మారుతుందా?
ఇప్పుడు కీర్తి ఆశలన్నీ ‘అక్క’ వెబ్ సిరీస్‌పైనే పెట్టుకుంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సిరీస్‌లో కీర్తి సురేష్‌తో పాటు బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించారు. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ కథ 1980ల నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందించారు. మహిళల ఆధిపత్యంలో నడిచే కల్పిత పట్టణం పెర్నూరులో అధికారం, ప్రతీకారం, ఆధిపత్య పోరు చుట్టూ ఎంతో ఆసక్తికరంగా ఈ కథ సాగుతుంది.
ఇందులో, కీర్తి సురేష్ భవానీ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించింది. ఇప్పటివరకు చూడని కొత్త గెటప్‌లో, బలమైన నటనకు అవకాశం ఉన్న పాత్రలో కీర్తి కనిపించడం విశేషం. అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ముందు నుంచి మంచి ఆసక్తి నెలకొంది. కానీ, తాజాగా ఈ సిరీర్ మీద నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 5 ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్ ప్రతీ సన్నివేశాన్ని ముందే ఊహించేలా అనిపిస్తున్నాయంటున్నారు. కీర్తి, నటన తప్ప మిగతా కంటెంట్ ఆశించినంత గొప్పగా లేదంటున్నారు. డివైడ్ టాక్ దగ్గరే అక్క సిరీస్ ఆగేలా ఉందని ప్రచారం జరుగుతోంది. దీన్ని, బట్టి కీర్తికి బాలీవుడ్‌లో రెండవ ప్రయత్నం కూడా డిసప్పాయింట్ చేసినట్టే అనిపిస్తోంది.


