సినిమా

Dhanunjay: ధనుంజయ్‌పై నటి ఫిర్యాదు.. వెనకేసుకొచ్చిన బిగ్‌బాస్ సెలబ్రిటీలు!

••4 నిమిషాల పఠనం

Dhanunjay: అమెజాన్ ప్రైమ్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్' ఫేమ్, నటుడు ధనుంజయ్‌పై నటి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన వేళ.. ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.

Dhanunjay: అమెజాన్ ప్రైమ్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్' ఫేమ్, నటుడు ధనుంజయ్‌పై నటి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన వేళ.. ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒకవైపు సోషల్ మీడియాలో తనను అసభ్యకరంగా ట్రోల్ చేస్తూ వేధిస్తున్నారంటూ బాధితురాలు కేసు పెట్టగా, మరోవైపు ధనుంజయ్‌కు బిగ్‌బాస్ సెలబ్రిటీలు బాహాటంగా మద్దతు తెలపడం తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ ధనుంజయ్ అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని, కించపరిచేలా మీమ్స్ క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కేవలం ధనుంజయ్ మాత్రమే కాకుండా, అతని ఫాలోవర్లు కూడా ఆన్‌లైన్‌లో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు:

ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ధను–దిను’ అనే అకౌంట్ ద్వారా తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా తప్పుడు పోస్టులు పెడుతున్నట్లు శ్రీదేవి వాపోయారు. ఈ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, ఆ వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారు? దాని వెనుక ఎవరెవరు ఉన్నారనే అంశంపై విచారణ మొదలుపెట్టారు. నటి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదుతో ధనుంజయ్ చిక్కుల్లో పడ్డారని అనుకుంటున్న తరుణంలో.. రియాలిటీ షో పాపులర్ ముఖాలు ఆయనకు వెన్నుదన్నుగా నిలిచాయి. గతంలో హిందీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న పాపులర్ యూట్యూబర్ అరుణ్ శ్రీకాంత్ మషెట్టితో పాటు తెలుగు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ప్రముఖ రేడియో జాకీ శేఖర్ బాషా ధనుంజయ్‌కు బహిరంగంగా మద్దతు పలికారు. ఒకవైపు నటి తీవ్రస్థాయిలో వేధింపుల ఆరోపణలు చేస్తుంటే.. మరోవైపు ఈ బుల్లి తెర సెలబ్రిటీలు వచ్చి ధనుంజయ్ పక్షాన నిలబడటం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కేసు విచారణ దశలో ఉండగా సెలబ్రిటీల ఎంట్రీతో ఈ వివాదం మరింత కాకరేపుతోంది.

#Dhanunjay#Dhanunjay Controversy#Actress Sridevi#Sridevi Police Complaint#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి