తెలంగాణ

నిమ్స్‌లో అక్రమాలపై కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు

రచన: NK•••3 నిమిషాల పఠనం

NIMS: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అక్రమాలకు సంబంధించి ఏసీబీ అధికారుల దర్యాఫ్తు కొనసాగుతోంది. 15మంది ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి నిమ్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

NIMS: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అక్రమాలకు సంబంధించి ఏసీబీ అధికారుల దర్యాఫ్తు కొనసాగుతోంది. 15మంది ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి నిమ్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు ఆపరేషన్ థియేటర్లు, మెడికల్ సోర్ట్స్ రికార్డ్స్ ని పరిశీలించారు. నిమ్స్ లో కొన్నేళ్లుగా జరిగిన అక్రమాలపై అధికారులు దృష్టి పెట్టారు. 3 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో పలు విభాగాల్లో సోదాలు చేస్తున్నారు.

నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీ భాస్కర్ అరెస్ట్ తో.. నిమ్స్ లో అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిమ్స్ లోని అన్ని విభాగాల్లో జరిగిన అక్రమాలపై దృష్టి సారించారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి సోదాలు చేసిన ఏసీబీ.. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. తాజాగా సర్జికల్ స్టోర్, ఆపరేషన్ థియేటర్లను తనిఖీలు చేసిన 2014 నుంచి పని చేస్తున్న స్టోర్ ఇంచార్జ్ లను ప్రశ్నించినట్లు సమాచారం.

లక్ష్మీ భాస్కర్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి ఒకరు లేదా ఇద్దరు అధికారులు రెగ్యులర్ గా నిమ్స్ లో సోదాలు చేస్తున్నారు. కానీ గత మూడు రోజులుగా ఒక టీమ్ గా ఏర్పడి నిమ్స్ లో సోదాలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి ఏసీబీ అధికారులు సోదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

సోమవారం నిమ్స్ లోని పలు విభాగాల్లో ఏసీబీ అధికారులు తిరిగారు. కీలకమైన డాక్యుమెంట్లు పరిశీలించారు. ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్స్, మెడికల్, సర్జికల్ స్టోర్లను చెక్ చేశారు. అక్కడ ఇంఛార్జ్ లుగా పని చేస్తున్న వారిని విచారించినట్లు సమాచారం. నిమ్స్ లో అక్రమాలపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. గతంలో జరిగినటువంటి టెండర్లు, కాంట్రాక్టులు, కొనుగోళ్లు, అమ్మకాలు.. వీటన్నింటిపై ఏసీబీ దృష్టి పెట్టింది.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి