ఏపీ

GVMC Elections: వైజాగైట్స్ ఏంట్రా ఇది? ఓటు వేయడానికి ఇంత బద్ధకమా..!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

GVMC Elections: సోషల్ మీడియాలో చూస్తే చాలు.. సిటీ రోడ్లు బాగోలేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అది మారాలి ఇది మారాలి అని పొద్దస్తమానం గొంతు చించుకుని పోస్టులు పెట్టే మనోళ్లు తీరా ఓటింగ్‌ రోజు మాత్రం సైలెంట్ అయిపోయారు.

GVMC Elections: సోషల్ మీడియాలో చూస్తే చాలు.. సిటీ రోడ్లు బాగోలేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అది మారాలి ఇది మారాలి అని పొద్దస్తమానం గొంతు చించుకుని పోస్టులు పెట్టే మనోళ్లు తీరా ఓటింగ్‌ రోజు మాత్రం సైలెంట్ అయిపోయారు. ప్రజాస్వామ్యంలో మన వాయిస్‌ని బలంగా వినిపించే బిగ్గెస్ట్ పవర్ ‘ఓటు’. అలాంటి ఓటును వేయడానికి ఏపీలోనే బిగ్గెస్ట్ సిటీ అయిన వైజాగ్‌ పీపుల్ అసలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. పోలింగ్ డే సండే రావడంతో.. హ్యాపీగా ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని పడుకోవడం, ఆఫ్టర్‌నూన్ నుంచి టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తూ రిలాక్స్ అవ్వడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు.

ఓటర్లేమో 18 లక్షల ప్లస్.. పోలింగ్ మాత్రం అట్టర్‌ ఫ్లాప్

స్టేట్‌లోనే లార్జెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీవీఎంసీ రేంజ్ రీసెంట్‌గా మరింత పెరిగింది. వార్డులు 98 నుంచి ఏకంగా 120కి జంప్ అయ్యాయి. ఓటర్ల సంఖ్య కూడా 17 లక్షల నుంచి 18.30 లక్షలకు పైగానే చేరింది. ఇంత హ్యూజ్ నంబర్స్ ఉన్నా.. గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఆఫ్టర్‌నూన్ 3 గంటల వరకు దాదాపు 18.30 లక్షల మందికి గాను కేవలం 7.80 లక్షల మంది మాత్రమే పోలింగ్ బూత్ దాకా వెళ్లారు. అంటే 3 గంటల వరకు రికార్డ్ అయిన పోలింగ్ పర్సంటేజ్ కేవలం 39.74% మాత్రమే.

లాస్ట్ టు అవర్స్ లోనూ నో క్రౌడ్..

గతంలో వైజాగ్‌లో దాదాపు 59.67% వరకు పోలింగ్ రికార్డ్ అయిన సీన్ ఉంది. కనీసం ఆ నంబర్ దాకా అయినా వెళ్తారేమో అనుకుంటే అదీ జరగలేదు. నార్మల్‌గా అయితే సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్యలో ఎలాగైనా ఓటు వేద్దామని జనాలు క్యూలు కడతారు, లాస్ట్ మినిట్ రష్ గట్టిగా ఉంటుంది. కానీ వైజాగ్‌లో ఆ లాస్ట్ 2 అవర్స్‌లో కూడా ఎక్కడా లైన్లు లేవు, రష్ అసలే లేదు. పోలింగ్ సెంటర్లు జనం లేక డల్‌గా కనిపించాయి.

సెలవు దొరికింది కదా అని ఇంట్లో కూర్చుని మ్యాచ్‌లు చూస్తే సరిపోతుందా? లీడర్లని, సిస్టమ్‌ని కామెంట్ చేసే ముందు మన బాధ్యతను కూడా నెరవేర్చాలి కదా అన్న కామెంట్స్ ఇప్పుడు వైజాగ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. మార్పు కావాలని సోషల్ మీడియాలో అరవడం కాదు బ్రో.. అసలైన రోజే ఇలా బద్ధకిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

#GVMC Elections#Visakhapatnam Elections#Vizag Voters#GVMC Polling#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి