తెలంగాణ

CPI: రైతులకు తక్షణమే కరువు సాయం అందించాలి- పల్లా వెంకటరెడ్డి డిమాండ్

రచన: NK••2 నిమిషాల పఠనం

మునుగోడు మండలంలోని చల్మడ గ్రామంలో సీపీఐ పార్టీ కరువు యాత్రను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.

CPI: మునుగోడు మండలంలోని చల్మడ గ్రామంలో సీపీఐ పార్టీ కరువు యాత్రను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అక్కడ నెలకొన్న కరువు పరిస్థితులు, నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పత్తి, వరి సాగు చేసిన రైతులకు అపార నష్టం కలిగినట్లు గుర్తించారు. రైతుల గోడు విని తీవ్ర ఆవేదన చెందారు పల్లా వెంకటరెడ్డి. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే కరువు సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎల్‌నినో, కరువు కారణంగా నష్టపోయిన వరి, పత్తి రైతులకు ఎకరాకు 30వేలు, వాణిజ్య పంటలకు 50వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పల్లా వెంకటరెడ్డి. అలాగే ఉపాధి హామీ పని దినాలు, కూలీ రేట్లు పెంచి రైతు కూలీలను ఆదుకోవాలన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపుతోందని, నిధుల కోత విధిస్తోందని ఆయన ఆరోపించారు.

#CPI#Palla Venkata Reddy#Farmers#Elnino#Drought#Munugode#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి