* చౌటుప్పల్‌లో వీడిన జోగిని సుధాకర్ హత్య కేసు
* ఆదివారం తెల్లవారుజామున దారుణ హత్య
* హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న చౌటుప్పల్ పోలీసులు
* అసోంకు చెందిన పవన్, హర్ష, సంతోష్ పాండే అరెస్ట్
* 130 తులాల బంగారు నగలు, 3 కేజీల 600 గ్రాముల వెండి, 9 లక్షల నగదు, సఫారీ కారు, ఒక కత్తి, 4 ఫోన్లు స్వాధీనo
Jogini Sudhakar: చౌటుప్పల్‌లో జోగిని సుధాకర్ దారుణ హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన 24 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేశారు. నగలు, నగదు కోసమే జోగిని సుధాకర్ ను హత్య చేసినట్టు నిర్ధారించారు. హత్య కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 130 తులాల 600 గ్రాముల బంగారం, రూ 9 లక్షల నగదు, ఒక కారు, హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు.
హత్యకు సంబంధించిన వివరాలను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. రెండు నెలల క్రితం జోగిని సుధాకర్ అసోం వెళ్లాడు. అక్కడ పవన్.. సుధాకర్ కు పరిచయం అయ్యాడు. సుధాకర్, పవన్ ఇద్దరూ హోమో సెక్స్‌లో పాల్గొనేవారు. ఆ సంబంధం ద్వారా పవన్ సుధాకర్ శిష్యుడిగా చేరాడు. పవన్‌తో పాటు హర్ష, సంతోష్ పాండే కూడా సుధాకర్ శిష్యులుగా చేరారు.
కొద్దిరోజుల క్రితం ఈ ముగ్గురు శిష్యులు సుధాకర్ ఇంటికి వచ్చారు. శిష్యుల గ్యాంగ్ సుధాకర్ సొత్తుపై కన్నేసింది. ఎలాగైనా వాటిని దక్కించుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా హత్యకు పథకం వేశారు. అనుకున్నట్టుగా ఆదివారం తెల్లవారుజామున సుధాకర్ ను దారుణంగా హత్య చేసి అతడి కారులోనే సొత్తుతో ఉడాయించారు. ఈ మర్డర్ కేసును సవాల్ గా తీసుకున్నాం. పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశాం'' అని ఎస్పీ తెలిపారు.


