సినిమా

RC 17: సర్‌ప్రైజ్ ఇచ్చారు..చాలా విషయాలలో క్లారిటీ ఇవ్వలేదు!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

RC 17: టాలీవుడ్‌లో మరోసారి క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదకి రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంతకాలంగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఎట్టకేలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు అధికారికంగా మొదలైంది. 2027, నవంబర్ 1న హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో RC 17 ప్రారంభమైంది.

RC 17: టాలీవుడ్‌లో మరోసారి క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదకి రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంతకాలంగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఎట్టకేలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు అధికారికంగా మొదలైంది. 2027, నవంబర్ 1న హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో RC 17 ప్రారంభమైంది.

మెగాస్టార్ క్లాప్‌తో ప్రారంభమైన RC 17:

RC 17 సినిమా ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చిరంజీవి కొబ్బరికాయ కొట్టి, సినిమాకు తొలి క్లాప్ ఇచ్చారు. రామ్ చరణ్ కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొని తండ్రి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

సుకుమార్ క్రియేటివిటీ.. ఆకట్టుకుంటున్న RC 17 పోస్టర్

ఇక, తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవంతో పాటుగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ కూడా ఆసక్తిని పెంచుతోంది. నెమలి ఈకను పోలిన డిజైన్‌లో రామ్ చరణ్ ముఖాన్ని చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'You Can Imagine' అనే క్యాప్షన్‌తో మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచారు. పోస్టర్ చూసిన తర్వాత చరణ్ పాత్ర బృందావనంలో కృష్ణుడా, లేక కురుక్షేత్రంలో కృష్ణుడా..!అనే ఆసక్తి మొదలైంది.

ఆర్సీ 17 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనప్పటికీ, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నదాని ప్రకారం 2027 సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందట. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.

అలాగే, ఎప్పుడూ సుకుమార్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ ఉంటాడు. కానీ, ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు. అంతేకాదు, హీరోయిన్‌గా కూడా నిన్నామొన్నటి వరకూ సరా అర్జున్, అలియా భట్ పేర్లు వినిపించగా, ఇప్పుడు ఆకాశంలో ఒక తారా ఫేమ్ తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి పేరు వినిపిస్తోంది. ఈ విషయాలలో మాత్రం సుకుమార్ కాస్త డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి.

#Ram Charan#RC 17#Sukumar#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి