తెలంగాణ

హైదరాబాద్‌లో ‘ఇందిరమ్మ ఇళ్ల టవర్స్’ అప్‌డేట్.. మరోసారి ఈ-లాటరీ!

రచన: Mamatha puppala••3 నిమిషాల పఠనం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్ల టవర్స్' పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్ల టవర్స్' పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. తొలి విడతలో ఫ్లాట్లు కేటాయించినప్పటికీ, లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తొలి వాయిదా చెల్లించలేకపోవడం, స్థానికంగా నివసించకపోవడం, ఇప్పటికే సొంత ఇళ్లు కలిగి ఉండటం లేదా దరఖాస్తుల్లో చిరునామాలు తప్పుగా నమోదు కావడం వంటి వివిధ కారణాలతో పలు ఫ్లాట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఫ్లాట్లను పారదర్శకంగా భర్తీ చేసేందుకు నవంబర్ 3 మరియు 4 తేదీలలో ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక ఈ-లాటరీ (E-Lottery) నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ అధికారికంగా ప్రకటించారు.

ముషీరాబాద్, ఎల్‌బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ తదితర నియోజకవర్గాల్లో ప్రతిపాదించిన ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్లకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, ప్రాథమిక పరిశీలన పూర్తయింది. ఈ క్రమంలో నవంబర్ 3న అర్హులైన దరఖాస్తుదారుల ఎంపిక కోసం తొలి విడత ఈ-లాటరీ చేపట్టగా, వివిధ కారణాల వల్ల రద్దయిన మరియు మిగిలిపోయిన ఫ్లాట్లను భర్తీ చేసేందుకు నవంబర్ 4న ఆన్‌లైన్ ద్వారా 'మాప్‌అప్' (Mop-Up) లాటరీని నిర్వహించనున్నారు.

దరఖాస్తుల్లో తప్పుగా పేర్కొన్న చిరునామాలను జియోకోడింగ్ (Geocoding), గూగుల్ మ్యాప్స్ (Google Maps) సహాయంతో సరిచేసి, ఆయా దరఖాస్తుదారులు ఏ నియోజకవర్గ పరిధిలోకి వస్తారో అధికారులు స్పష్టంగా గుర్తించారు. ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఏ నియోజకవర్గంలో నివసించే అర్హులైన పేదలకు అక్కడే సొంత ఇంటి వసతి కల్పించేలా ఈ కసరత్తు చేపట్టారు. ముఖ్యంగా ఖైరతాబాద్‌తో పాటు పలు నియోజకవర్గాల్లో మిగిలిన ఖాళీలను ఈ మాప్‌అప్ లాటరీ ద్వారా భర్తీ చేసి, అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల కేటావించనున్నారు.

#IndirammaTowers2026#VPGauthamHousingBoard#HyderabadIndirammaHouses#TelanganaHousingScheme#ELotteryHyderabad#HydNewsTelugu#TelanganaNewsTelugu#RealEstateNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి