తెలంగాణ

TG: దేశాన్ని 'అదానీ'కి కట్టబెడుతున్నారు.. బీజేపీ తీరుపై పొన్నం ఫైర్!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా అదానీ గ్రూప్‌కే ధారాదత్తం చేస్తోందని, యావత్ భారతదేశాన్ని ‘అదానీకరణ’ చేసే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.

TG: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా అదానీ గ్రూప్‌కే ధారాదత్తం చేస్తోందని, యావత్ భారతదేశాన్ని ‘అదానీకరణ’ చేసే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా పర్యటన కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే పరిమితమైందని, తెలంగాణ ప్రయోజనాలపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

దేశంలో 'ఏఏ' ట్యాక్స్ పాలన

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను సూటిగా ఎండగట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కేవలం ఆ ముగ్గురు గుజరాతీయుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం రాజ్యాంగబద్ధ పాలన కాకుండా ‘ఏఏ’ (అంబానీ, అదానీ) ట్యాక్స్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, గనులు, మౌలిక వనరులను ఒకే కార్పొరేట్ సంస్థకు అప్పగిస్తూ యావత్ వ్యవస్థను వారి గుప్పిట్లోకి నెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ విభజన చట్టం కింద రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధమైన హక్కులు, నిధులపై హైదరాబాద్ గడ్డ మీద అమిత్ షా ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలపై రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.

ఓట్ల కుట్రలపైనే మా పోరాటం..

చొరబాటుదారుల పేరిట బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి కొట్టిపారేశారు. చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించడాన్ని కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. అయితే ఓటర్ల జాబితా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లను తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనే తాము గళమెత్తుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవు, ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కేంద్రం వెంటనే పరిహారం అందించాలని, పార్లమెంట్‌ను సమావేశపరిచి ఎస్‌ఐఆర్‌‌పై చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

#Ponnam Prabhakar#Amit Shah#BJP#Adani Group#Gautam Adani#Narendra Modi#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి