తెలంగాణ

TG : కళ్యాణలక్ష్మి,షాదీముుబారక్‌.. ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం!

రచన: Kumar4 నిమిషాల పఠనం

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు, వాటి చట్టబద్ధత అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. మంగళవారం హైకోర్టులో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై కీలక విచారణ జరిగినట్టు సమాచారం. అటు పిటిషనర్, ఇటు ప్రభుత్వం తరఫు లాయర్ పోటాపోటీగా వాదనలు వినిపించినట్టు తెలుస్తోంది.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు, వాటి చట్టబద్ధత అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. మంగళవారం హైకోర్టులో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై కీలక విచారణ జరిగినట్టు సమాచారం. అటు పిటిషనర్, ఇటు ప్రభుత్వం తరఫు లాయర్ పోటాపోటీగా వాదనలు వినిపించినట్టు తెలుస్తోంది. ఈ పథకాలకు చట్టబద్ధత లేదని గతంలో పిటిషనర్ వాదించడంతో వాటి అమలుపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ‘స్టే’ విధించడం వలన వేలాది మంది పేద లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు.

‘మరి ఇన్ని రోజులు ప్రభుత్వం ఏం చేసింది? సింగిల్‌ బెంచ్‌ ముందు కౌంటర్‌ దాఖలు చేయడంలో ఎందుకు జాప్యం జరిగింది? కౌంటర్‌ దాఖలు చేస్తామని చెప్పి.. గడువు ముగిసినా ఎందుకు దాఖలు చేయలేదు?’ అని ప్రభుత్వ జాప్యంపై గతంలోనే హైకోర్టు సింగిల్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతోనే న్యాయస్థానం స్టే విధించిందా? అని ప్రశ్నలు ఉత్పన్నం అవుతుండగా.. స్టే విధించిన తర్వాతే డివిజన్‌ బెంచ్‌ను ప్రభుత్వం ఆశ్రయించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఇదే అంశంపై బీఆర్‌ఎస్‌ నిరసనలు చేస్తుండగా.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ఆపొద్దంటూ బీఆర్‌ఎస్‌ ఆందోళనలు చేస్తోంది.

లబ్ధిదారుల ప్రయోజనాల కోసం పథకాలను కొనసాగించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు డివిజన్‌ బెంచ్‌లో ప్రభుత్వం చేస్తున్న వాదనలపై ఆసక్తి నెలకొంది.‘పథకాల చట్టబద్ధతపై సర్కార్‌ ఏం వివరణ ఇవ్వనుంది? స్టే ఎత్తివేస్తారా? సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులే కొనసాగుతాయా?’ డివిజన్‌ బెంచ్‌ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలాఉండగా,రేవంత్ సర్కార్ కావాలనే ఈ స్కీమ్స్ నిలిపివేయడానికే ఇంతకాలం కౌంటర్ దాఖలు చేయలేదని..తమ పోరాటాల వల్లే డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

https://x.com/pulsenewsbreak/status/2094646013319643360?s=20

#kalyanalaxmi#shadimubharak#schemes#highcourt#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి