క్రీడలు

పాక్ క్రికెట్‌ పతనానికి కారణం ఇదేనా..? మాజీ క్రికెటర్  సంచలన వ్యాఖ్యలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

వరుస పరాజయాలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అంతర్గత వివాదాలు మరింత కలకలం రేపుతున్నాయి. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్, పేసర్ షాహీన్‌షా అఫ్రిది మధ్య నెలకొన్న కెప్టెన్సీ విభేదాలే పాక్ క్రికెట్ పతనానికి ప్రధాన మూలకారణమని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.

వరుస పరాజయాలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అంతర్గత వివాదాలు మరింత కలకలం రేపుతున్నాయి. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్, పేసర్ షాహీన్‌షా అఫ్రిది మధ్య నెలకొన్న కెప్టెన్సీ విభేదాలే పాక్ క్రికెట్ పతనానికి ప్రధాన మూలకారణమని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను పాకిస్థాన్ 0-2తో దారుణంగా కోల్పోయిన అనంతరం టీవీ షోలో మాట్లాడిన ఆయన, బాబర్ బలమైన కెప్టెన్ కాదని, ఆటగాళ్ల మధ్య గొడవలు ప్రారంభమైన రోజే పాక్ క్రికెట్ నాశనమైందని విమర్శించారు.

కెప్టెన్సీ విషయంలో మహ్మద్ రిజ్వాన్, బాబర్, షాహీన్, షాన్ మసూద్‌ల మధ్య బోర్డు పదేపదే మార్పులు చేయడం కూడా జట్టు స్థిరత్వాన్ని దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 194పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన వెంటనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. మూడో టెస్టుకు సంబంధించి ప్రకటించిన జట్టు నుంచి ఏకంగా సగం మంది ఆటగాళ్లకు మొండిచేయి చూపించింది.

సీనియర్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌తో పాటు ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అఘా, అలీ ఉస్మాన్, ఆమర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రమ్ షాజాద్‌లను జట్టు నుంచి తొలగించింది. వారి స్థానంలో అరాఫత్ మిన్హాస్, మహ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహ్మద్ ఇమ్రాన్ రంధావా, రజావుల్లాల వంటి ఐదుగురు కొత్త ఆటగాళ్లకు జట్టులో అవకాశం కల్పించింది. కేవలం ఆటగాళ్లపైనే కాకుండా కోచింగ్ సిబ్బందిపైనా పీసీబీ సర్జికల్ స్ట్రైక్ చేసింది.

టెస్టు జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను పదవుల నుంచి తొలగించింది. వారి స్థానాల్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న మైక్ హెస్సన్, బౌలింగ్ కోచ్ యాష్లేనోఫ్‌కేలకు టెస్టు జట్టు బాధ్యతలను కూడా అప్పగించింది. తీవ్రమైన వివాదాలు, ప్రక్షాళన తర్వాత కొత్త ముఖాలతో బరిలోకి దిగుతున్న పాకిస్థాన్ ఆఖరి టెస్టులో ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

#PakistanCricket#BabarAzam#ShaheenAfridi#BasitAli#PCBNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి