Varanasi: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాకి డీల్ కుదరలేదా? ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఆయన సినిమా అంటే పెద్ద పెద్ద సంస్థలు రిలీజ్ చేసేందుకు భారీ మొత్తం చెల్లించి మరీ ముందుకు వస్తాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విషయంలో మనం చూశాము. పివిర్ వాళ్ళు ఆర్ఆర్ఆర్ సినిమాను ఎంతగా ప్రమోట్ చేశారో అందరికీ తెలిసిందే. స్టార్ మా కూడా ఈ సినిమాను భారీ మొత్తానికి రైట్స్ దక్కించుకుంది.
కానీ, తాజాగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి మూవీకి మాత్రం ఆశించిన మొత్తం రావడం లేదట. డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ వారు వారణాసి సినిమాని అన్నీ భాషలకి కలిపి రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చారట. కానీ, దాన్ని రాజమౌళి తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. వీరు ఊహించినదాని కంటే నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ చాలా తక్కువ ఉందని జక్కన్న నో చెప్పాడని సమాచారం.
అందుకే, తాత్కాలికంగా ఓటీటీ డీల్ ని పక్కన పెట్టారట. ఇంటర్నేషనల్ కంపెనీలతో కూడా రాజమౌళి చర్చలు జరపగా..అవి కూడా ఫలించలేదని తెలుస్తోంది. అయినా కూడా రాజమౌళి చాలా కాన్‌ఫిడెంట్‌గా ఉన్నాడట. ఏమాత్రం డిజిటల్ రైట్స్ విషయంలో తొందరపడటం లేదట. అనుకున్న ఆఫర్ వస్తేనే రైట్స్ ఇవ్వాలని గట్టిగా కూర్చున్నాడట. ఇక, ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.
ఈ నెల నుంచే సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ చేయనున్నాడు. జనవరి వరకూ ఈ వర్క్ మొత్తం ఫినిష్ చేయనున్నాడు. అలాగే, రెండు పాటలు కూడా బ్యాలెన్స్ ఉందట. ఇక, వారణాసి సినిమాను 2027, ఏప్రిల్ 7న 120 దేశాలలో దాదాపు 50 భాషలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న వారణాసి చిత్రాన్ని శ్రీదుర్గ ఆర్ట్స్, ఎస్.ఎస్.కార్తికేయ కలిసి 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.











