Kaaka: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సినిమాలకి సంబందించిన లీక్స్ ఇస్తూ అభిమానుల్లో ఆతృతను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఆయన నోట మాట వస్తే చాలు.. అది లీక్ అవుతుందా? లేక కావాలనే బయటకు వస్తుందా? అని అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా, ఆయన ప్రస్తుతం నటిస్తున్న కాకా సినిమా విషయంలో అదే జరుగుతోంది. ఓపెనింగ్ రోజే సినిమా టైటిల్ ని లీక్ చేయడానికి ట్రై చేసి ఆసక్తి రేపాడు. ఇక, ఆ తర్వాత టైటిల్ విషయంలో చిన్న హింట్ ఇచ్చి ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేసిన చిరు..తాజాగా ఏకంగా తన క్యారెక్టర్ పేరునే రివీల్ చేశారు. కాకా అంటే కదిరి కాళిదాస్ అంటూ లీక్ ఇచ్చాడు.
చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న సినిమా కాకా. ఇంతకముందు వీరిద్దరు కలిసి వాల్తేరు వీరయ్య చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీని తర్వాత మరోసారి కలిసి కాకా సినిమాను చేస్తుండటంతో ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే అంచనాలు బాగా పెరిగాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కంటే ముందే..చిరు లీక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
ఇక, ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో సంగీత దర్శకుడు తమన్ తో.. చిరంజీవి మాట్లాడుతూ.. టైటిల్ ఇంకా 'కదిరి' అనే ఉంచారా.! అని అడిగారు. దీంతో సినిమా టైటిల్ లో 'కదిరి' అనే పదం గ్యారెంటీగా ఉందంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అంతేకాదు, 'కదిరి కాకాజీ'..అనే టైటిల్ పెడుతున్నాతంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ, చిరంజీవి బర్త్ డే రోజు మేకర్స్ 'కాకా' టైటిల్ ను ప్రకటించారు.
దీంతో, చిరంజీవి కావాలనే రాంగ్ లీక్ ఇచ్చి.. అసలు పేరును సీక్రెట్ గా ఉంచారని మాట్లాడుకున్నారు. ఇక, తాజాగా.. మరోసారి మెగాస్టార్ 'కాకా' మూవీలో తన పాత్ర పేరును స్వయంగా బయటపెట్టడంతో చిరు లీక్స్ మళ్లీ వైరల్ గా మారాయి. 'కాకా' సినిమాలో చిరంజీవి రోల్ పేరు 'కదిరి కాళిదాస్' అంటూ చెప్పుకొచ్చారు. కానీ, మరో షేడ్ ఉంటుందట. ఆ పాత్ర పేరే టీజర్ లో చూపించిన సత్యం. మొత్తానికి, చిరు 'కాకా' లో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని అర్థమవుతోంది. ప్రజెంట్ రోల్ పేరు కె.సత్యం..ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పేరు 'కదిరి కాళిదాస్' అని తెలుస్తోంది.









