Amazon: దసరా, దీపావళి సీజన్ రాకముందే ఈ-కామర్స్ రంగంలో వార్ స్టార్ట్ అయ్యింది. ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు నిద్రలేకుండా చేసే అసలైన డిస్కౌంట్ల పండగకు రంగం సిద్ధమైంది. తన ప్రత్యర్థి సంస్థ ఫ్లిప్‌కార్ట్ కంటే ఒక అడుగు ముందే ఉంటూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఎత్తుగడ వేసింది. మోస్ట్ అవేటెడ్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్ ఎప్పటినుంచి ప్రారంభం కానుందో అధికారికంగా రివీల్ చేసింది.
ఫ్లిప్‌కార్ట్ కంటే ముందే ఎంట్రీ
ఈ ఏడాది ఫెస్టివల్ వార్‌లో అమెజాన్ ముందస్తు వ్యూహం ఆసక్తికరంగా మారింది. ఫ్లిప్‌కార్ట్ తన పాపులర్ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను అక్టోబర్ 9 నుంచి తీసుకువస్తుండగా, దానికి ఒక్కరోజు ముందే.. అంటే అక్టోబర్ 8 నుంచే అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పండగ మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లకు అక్టోబర్ 8 నుంచి యాక్సెస్ ఉన్నప్పటికీ, అమెజాన్ మాత్రం తన సాధారణ సేల్‌ను అదే రోజున ఓపెన్ చేసి భారీగా ట్రాఫిక్‌ను లాగేందుకు ప్లాన్ చేసింది.
SBI కార్డ్స్‌పై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్
ఈ మెగా సేల్‌లో కస్టమర్ల కోసం కళ్లుచెదిరే డీల్స్ ప్లాన్ చేసినట్లు అమెజాన్ తన మైక్రోసైట్‌లో వెల్లడించింది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఏకంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ యూజర్స్‌కి మరో 10 శాతం వరకు అదనపు ఆఫర్లు, ప్రత్యేక బెనిఫిట్స్ ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రైమ్ యూజర్లకు ఎప్పటిలాగే సేల్ ముందుగానే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
రాత్రి 8 గంటల డీల్స్.. బ్లాక్‌బస్టర్ ఆఫర్లు
షాపింగ్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రత్యేక కేటగిరీలను అమెజాన్ సిద్ధం చేస్తోంది. ప్రతిరోజూ '8 PM డీల్స్', కళ్లుచెదిరే రేట్లతో 'బ్లాక్‌బస్టర్ డీల్స్', 'టాప్ 100 డీల్స్'తో పాటు 'మెగా డీల్స్' పేరుతో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ రాయితీలను అందించనుంది. ఈ సేల్ ఎప్పటివరకు కొనసాగుతుందనే అమెజాన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా ప్రొడక్ట్ వైజ్ డిస్కౌంట్ల వివరాలు బయటకు రానుండటంతో టెక్, గాడ్జెట్ లవర్స్ తమ విష్ లిస్ట్‌లను రెడీ చేసుకుంటున్నారు.







