సినిమా

The Paradise: నైజాంలో ప్యారడైజ్ కి టికెట్ హైక్ తో పాటు ప్రీమియర్స్‌కి పర్మిషన్స్

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradise: గత కొంతకాలంగా మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్కేల్ లో రూపొందించే సినిమాలకి రిలీజ్ సయమలో రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలను పెంచమని కోరుతు మేకర్స్ ప్రభుత్వాలకి లేఖ రాస్తున్నాయి. దానిని పరిశీలించిన సినిమాటోగ్రఫీ మంత్రి..అధికారులతో మాట్లాడి..అవసరం మేరకు రిలీజ్ రోజు నుంచి కొద్ది రోజులు సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లో ధరలను పెంచుతూ జీవోను ఇస్తున్నారు.

The Paradise: గత కొంతకాలంగా మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్కేల్ లో రూపొందించే సినిమాలకి రిలీజ్ సయమలో రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలను పెంచమని కోరుతు మేకర్స్ ప్రభుత్వాలకి లేఖ రాస్తున్నాయి. దానిని పరిశీలించిన సినిమాటోగ్రఫీ మంత్రి..అధికారులతో మాట్లాడి..అవసరం మేరకు రిలీజ్ రోజు నుంచి కొద్ది రోజులు సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లో ధరలను పెంచుతూ జీవోను ఇస్తున్నారు. అలాగే, నాని సినిమాకి కూడా ఈ వెసులుబాటు కల్పించారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కయాదు లోహర్ జంటగా నటించిన ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మోహన్ బాబు, సంపూ కీలక పాత్రలో..కీర్తి సురేష్ స్పెషల్ నంబర్ లో అలరించబోతోంది. ఇప్పటికే, విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఎలాంటి, థియేట్రికల్ ట్రైలర్ లేకపోయినా భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించకపోయినా కూడా ప్యారడైజ్ సినిమాకి ఊహించని విధంగా పాన్ ఇండియా లెవల్‌లో హైప్ క్రియేట్ అయింది. ఇక, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి తాజాగా టికెట్ ధరలను పెంచుతూ ప్రీమియర్స్‌కి అనుమతులిస్తూ జీవోను విడుదల చేశారు. దీని,ప్రకారం పెరిగిన టికెట్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి.

తెలంగాణాలో రిలీజ్ కి ఒక ముందు రోజు సాయంత్రం 6 గంటల 30 నిముషాలకే ప్యారడైజ్ ప్రదర్శనలు మొదలు కానున్నాయి. ఈ ప్రీమియర్స్ షోస్ కి గాను టికెట్ ధర రూ. 500 ఫిక్స్ చేశారు.

ఇక, సింగిల్ స్క్రీన్స్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

ప్యారడైజ్ సినిమా రిలీజ్ డేట్ నుంచి అనగా, సెప్టెంబర్ 24 నుంచి సింగిల్ స్క్రీన్స్ కి 4 రోజులు పాటుగా అదనంగా 48 రూపాయలు పెంచుకోవచ్చి. ఆ తర్వాత, రోజు నుంచి మరో 6 రోజుల పాటుగా 23 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అలాగే, మల్టీప్లెక్స్ లలో ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

మల్టీప్లెక్స్ ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 24 నుంచి 4 రోజులు పాటు అదనంగా 95 రూపాయలు పెంచుకోవచ్చు. ఆ తర్వాత, నుంచి మరో 6 రోజుల పాటుగా 45 రూపాయలు పెంచుతూ అనుమతులు ఇచ్చారు. మరి, భారీ హైప్ ఉన్న ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ ఫిగర్‌ను నమోదు చేస్తుందో చూడాలి.

#nani#the paradise#kayadu lohar#srikanth odela#keerthy suresh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి