సినిమా

Jana Nayagan: చెన్నైలో విజయ్ సినిమా షోలు నిలిపివేత..కారణం చిన్నపిల్లలే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Jana Nayagan: మల్టీప్లెక్స్ లలో గానీ, సింగిల్ స్క్రీన్స్ లో గానీ, యూ/ఎ సర్టిఫికెట్ ఉన్న సినిమాలకే చిన్నా, పెద్దా అందరినీ సినిమా చూసేందుకు అనుమతిస్తారు. ఎ రేటెడ్ సినిమాలకి 18 ఏళ్ళు నిండని వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. టికెట్ కౌంటర్స్ లోనే క్లియర్‌గా చెప్పేస్తారు..మీతో మీ పిల్లలుంటే షోకి అనుమతించరు అని. దీనికి, కారణం అడల్ట్ కంటెంట్..హింసాత్మక సన్నివేశాలు, రక్తపాతం ఉన్న సన్నివేశాలు ఉండటమే.

ఇలాంటి, సన్నివేశాలను 18 ఏళ్ళ లోపు పిల్లలకి చూపించరాదని సెన్సార్ బోర్ట్ కఠిన నిబంధనలు విధించింది. అయితే, తలపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా జన నాయగన్ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ప్రదర్శింపబడుతోంది. అయితే, చెన్నైలోని మల్టీప్లెక్స్ లలో కొన్ని స్క్రీన్స్ లో చిన్న పిల్లలతో ఫ్యామిలీ జన నాయగన్ సినిమాను చూసేందుకు వచ్చారట.

ఇది, తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి, షోలను నిలిపివేసి వీక్షకులను బయటకి పంపారట. ప్రస్తుతం అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఈ విషయమై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. సీఎం హోదాలో ఉండి ఇంత బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తున్నారని కొందరు నెగిటివ్ కూడా కామెట్స్ చేస్తున్నారు. సాధారణంగా ఇది తల్లితండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దీనికి, సీఎం ని నింధించడం సరి కాదని ఆయన అభిమానులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.

కాగా, ఈ సినిమా పలు వాయిదాల తర్వాత రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇందుకు, కారణం తెలుగులో నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్ సాధించిన భగవంత్ కేసరి చిత్రాన్ని పోలి ఉందని అందరూ అంటున్నారు. వాస్తవానికి, థియేట్రికల్ ట్రైలర్ చూసిన ఏ ఒక్కరైనా అదే మాట అంటారు. ఇక సినిమా చూసిన వారు అనడంలో ఆశ్చర్యం ఏముంది. విజయ్ నటించిన చివరి సినిమా. మరి, ఇంత బ్లైండ్ గా ఎలా ఒప్పుకున్నాడో.

#jananayagan#vijay#thalapathyvijay#poojahegde#hvinoth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి