Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు చేతికి వెళ్ళాయా? ప్రస్తుతం, అవుననే మాట వినిపిస్తోంది. ఈ మధ్య మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల విడుదల సమయంలో డిస్ట్రిబ్యూషన్ పరంగా దిల్ రాజు ఇబ్బంది పెట్టినట్టుగా వచ్చిన వార్తల గురించి అందరికీ తెలిసిందే. అంతకముందు, హరిహర వీరమల్లు సమయంలోనూ ఇలాగే జరిగింది.
అందుకే, నట్టి కుమార్ లాంటి వాళ్ళు దిల్ రాజుని నేరుగానే ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ పైనే ఎందుకింత కక్ష్య సాధింపు వ్యవహారం అంటూ వాపోయారు. కానీ, తాజాగా ఇదే దిల్ రాజు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని నైజాం, వైజాగ్ కి దక్కించుకున్నాడు.

మైత్రీ వారు లేదా యూవీ వారే రిలీజ్ చేస్తారని నిన్నా మొన్నటి వరకూ ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపించింది. కానీ, అధికారికంగా దిల్ రాజు దక్కించుకున్నాడని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటిస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.
మిరాయ్ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రీతికా నాయక్ ఇందులో వరుణ్ తేజ్ కి జంటగా నటించింది. కమెడియన్ సత్య కీలక పాత్రలో అలరించనున్నాడు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్..ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక, ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో కొరియన్ కనకరాజు పై మంచి బజ్ క్రియేట్ అయింది. వరుణ్ తేజ్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయింది. మరి, ఈ సినిమాతోనైనా హిట్ కొట్టి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కమిటవుతాడా లేదా చూడాలి.












