సినిమా

Indian-3: శంకర్-కమల్ ల సినిమాను లైట్ తీసుకుంటున్నారా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Indian-3: ఒకప్పుడు ఇండియన్ జేంస్ కెమరూన్ అనే పేరున్న దర్శకుడు శంకర్..ఇప్పుడు ఓ సాదా సీదా కొత్త దర్శకుడిగా హిట్ కోసం వెంపర్లాడుతున్నాడు. దీనికి, కారణం ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడమే. మళ్ళీ, ఇండియన్ సీక్వెల్ మూవీ ఇండియన్ 3తో వచ్చేందుకు శంకర్ రెడీ అవుతున్నాడట. కానీ, మళ్ళీ ఆయన సినిమాలు చూసేంత సాహసం చేయడానికి ఎవరూ రెడీగా లేరని చెప్పుకుంటున్నారు.

ఒకప్పుడు, శంకర్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ లో ఓ క్రేజ్ ఉండేది. టెక్నాలజీని ఆయన అప్‌డేట్ అయినట్టుగా ఇంకో దర్శకుడు అప్‌డేట్ అవడని మాట్లాడుకున్నారు. అలాగే, ఎంత హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సినిమా తీసినా..సామాజిక అంశం మాత్రం ఖచ్చితంగా జోడించి ఎమోషన్స్‌తో కట్టి పడేస్తాడు. శంకర్ తీసిన ఏ సినిమా చూసినా ఈ విషయం అర్థమవుతుంది.

రోబో లాంటి సినిమాలోనూ ప్రేమ..వ్యామోహం..బంధం..బాధ్యత..వంటి మానవాళికి సంబందించిన అంశాలను చూపించాడు. ఇక, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఈ సినిమాతో అటు శంకర్ ఇటు కమల్ హాసన్ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు భారీ స్థాయిలోనే. కానీ, కనీసం దాంట్లో 10 శాతం కూడా ఇండియన్ 2 సంపాదించలేకపోయింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ ఒకటే సందేహం. ఇదసలు శంకర్ సినిమానా అని.

దీని, తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్ చూసి మెగా ఫ్యాన్స్ ఎంతగా హర్ట్ అయ్యారంటే..అసలు శంకర్ తో సినిమా చేయడమే పెద్ద రాంగ్ స్టెప్ అని నేరుగానే అన్నారు. ఈ రెండు సినిమాల ప్రభావం శంకర్ మీద గట్టిగా పడింది. బాలీవుడ్ లో ప్రకటించిన సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడుంది ఆయన చేతిలో ఇండియన్ 3. కానీ, ఈ సినిమాను చూసేందుకు ఎవరూ రెడీగా లేరు. శంకర్ ప్రయోగానికి భయపడుతున్నారు. మరి, నిజంగా శంకర్-కమల్ కలిసి ఇండియన్ 3తో యావరేజ్ టాక్ అని వింటారో లేదో.

#indian 3#shankar#kamal hassan#kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి