Samyuktha Menon: నేడు మలయాళ భామ సంయుక్త మేనన్ పుట్టినరోజు( సెప్టెంబర్ 11.09.2026). ఈ సందర్భంగా ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ నుంచి అప్‌డేట్స్ ని ఇచ్చారు మేకర్స్. రామ్ పోతినేని నటిస్తున్న రాపో 23 లో సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయాన్ని తాజాగా ప్రకటించారు. అలాగే, నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమా నుంచి బర్త్ డే విషెస్ తెలుపుతూ సంయుక్త పాత్రకి సంబందించిన చిన్న వీడియోను రిలీజ్ చేశారు.
చాలాకాలంగా నిఖిల్ నటించిన సినిమా ఏదీ బాక్సాఫీస్ వద్ద విడుదల కాలేదు. ఎప్పటి నుంచో ఈ యంగ్ హీరో నటిస్తున్న స్వయంభు సినిమా నుంచి అప్పుడొకటి అప్పుడొకటి వార్తలైతే వస్తున్నాయి గానీ, ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు. అయితే, నిఖిల్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా మాత్రం భారీ స్థాయిలో ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను స్వయంభు మూవీ జరుపుకుంటోంది. ఇందులో, హీరోయిన్‌గా నటిస్తున్న సంయుక్త మేకింగ్ వీడియోను ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇందులో, ఆమె కత్తి యుద్ధం..గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. అలాగే, పెద్ద పెద్ద కొండలను ఎక్కుతోంది. ఇక, భారీ యాక్షన్ సీన్స్ కోసం కూడా రోప్స్ సహాయంతో ఎంతో ఎత్తు నుంచి దూకే విజువల్స్ కూడా తాజా వీడియోలో కనిపిస్తున్నాయి. మొత్తానికి స్వయంభు సినిమా కోసం సంయుక్త బాగానే శ్రమిస్తోంది. ఇక, అక్కడక్కడా బాహుబలి మూవీలో తమన్నా ఛాయలు కనిపిస్తున్నాయి.
పూరి స్లమ్ డాగ్ నుంచి అప్‌డేట్స్:

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న స్లమ్ డాగ్ మూవీ నుంచి కూడా తాజాగా సంయుక్త మేనన్ వర్కింగ్ స్టిల్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో, ఆమెది హోంలీ పాత్ర అని అర్థం అవుతోంది. చాలాకాలంగా పూరి జగన్నాధ్ కి కూడా సరైన సక్సెస్ లేదు. ఇప్పుడు, రూపొందిస్తున్న స్లమ్ డాగ్ మూవీతో సాలీడ్ హిట్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. నిజంగా, ఈ సినిమా గనక హిట్ అయితే సంయుక్తకి మంచి పేరొస్తుంది. మొత్తానికి, ఈ మలయాళ బ్యూటీ పుట్టినరోజుకి మాత్రం సాలీడ్ అప్‌డేట్స్ వచ్చేశాయి.










