సినిమా

Tollywood : భారీ బడ్జెట్ మూవీలు ఎందుకు బోల్తాపడుతున్నాయి?

రచన: Mahesh6 నిమిషాల పఠనం

Tollywood : చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఒకే ఒక్క మంత్రం మార్మోగుతోంది.. అదే ‘పాన్ ఇండియా’. వందల కోట్ల బడ్జెట్, ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్లు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మునుపెన్నడూ చూడని స్టార్ క్యాస్టింగ్ ఉంటే చాలు.. బాక్సాఫీస్ బద్దలైపోతుందని చాలామంది నిర్మాతలు నమ్ముతున్నారు.

Tollywood: చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఒకే ఒక్క మంత్రం మార్మోగుతోంది.. అదే ‘పాన్ ఇండియా’. వందల కోట్ల బడ్జెట్, ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్లు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మునుపెన్నడూ చూడని స్టార్ క్యాస్టింగ్ ఉంటే చాలు.. బాక్సాఫీస్ బద్దలైపోతుందని చాలామంది నిర్మాతలు నమ్ముతున్నారు. కానీ, థియేటర్ల ముందు సీన్ చూస్తుంటే మాత్రం పరిస్థితి తలకిందులవుతోంది. వందల కోట్లు గుమ్మరించినా కథలో సత్తా లేకపోతే ప్రేక్షకులు సింపుల్‌గా నో చెబుతున్నారు. భారీ బడ్జెట్ అంచనాలు తప్పుతుండటానికి, వరుస ప్లాప్‌లకు వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు టాలీవుడ్‌లో వేడివేడి చర్చకు దారితీస్తున్నాయి.

రెమ్యూనరేషన్లకే సగం.. మేకింగ్‌కి మిగిలేదేంటి?

నేడు ఒక సినిమా బడ్జెట్‌లో సింహభాగం కేవలం హీరోలు, దర్శకుల రెమ్యూనరేషన్లకే సరిపోతోంది. హీరోలకు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్లు ఇస్తుండటంతో, అసలు సినిమా మేకింగ్‌కు అయ్యే ఖర్చు కంటే కాస్టింగ్ ఖర్చే కొండంతగా మారుతోందని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక దీనికి తోడు కథతో సంబంధం ఉన్నా లేకపోయినా.. ఏదో ఆర్భాటం కోసం కోట్ల రూపాయలు గుమ్మరించి చేసే విఎఫ్ఎక్స్ హంగామా సరేసరి.

ప్లాపులకు కారణమవుతున్నవి ఇవే..

స్టార్ ఇమేజ్, పాన్ ఇండియా క్రేజ్ మైకంలో పడి నిర్మాతలు, డైరెక్టర్లు అసలైన ‘కథ’ను విస్మరిస్తున్నారు. కథనంలో బలం లేనప్పుడు అంతర్జాతీయ స్థాయి మేకింగ్ కూడా సినిమాను కాపాడలేకపోతోందని ఇటీవల రిలీజ్ అయిన పలు సినిమాలు నిరూపించాయి. సరైన ప్రీ పొడక్షన్ లేకపోవడం వల్ల రీ-షూట్లు, రీ-షెడ్యూళ్ల పేరుతో కోట్లు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. అలాగే కేవలం పాన్ ఇండియా మార్కెట్ కోసం ప్రతి భాష నుంచి నటులను దింపడమే కానీ, వారి పాత్రలకు సరైన ప్రాధాన్యత ఉండటం లేదు.

భారీ చిత్రాలకు బాక్సాఫీస్ షాక్

ఇటీవల కాలంలో భారీ అంచనాలతో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో వచ్చిన ‘టాక్సిక్’ వంటి చిత్రాలు థియేటర్లలో మిక్సిడ్ రెస్పాన్స్ తెచ్చుకుని ప్లాప్ దిశగా అడుగులు వేయడం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. అలాగే గతంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం కూడా ఓవర్సీస్ మార్కెట్‌లో ఘోరంగా నిరాశపరిచడంతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మరికొన్ని చోట్ల ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్స్ రావడం మేకర్స్‌కి కాస్త ఊరట కలిగించే విషయంగా చెబుతున్నారు.

చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ!

ఇదే సమయంలో, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ‘మా ఇంటి బంగారం’ లాంటి చిన్న చిత్రాలు నిరూపించాయి. పరిమితమైన బడ్జెట్‌తో, నటీనటుల న్యాచురల్ యాక్టింగ్, బలమైన ఎమోషన్స్‌తో వచ్చిన కథతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల మైలురాయిని చేరుకుని సంచలనం సృష్టించింది. ప్రేక్షకుడికి కావాల్సింది కోట్ల రూపాయల గ్రాఫిక్స్ కాదు.. కనెక్ట్ అయ్యే ఎమోషన్ మాత్రమేనని ఇలాంటి సినిమాలు నిరూపించాయి.

వందల కోట్ల బడ్జెట్లు, హాలీవుడ్ స్థాయి విజువల్స్ సినిమాకు ఆకర్షణ మాత్రమే కానీ.. ఆత్మ కాదు. సినిమాకి అసలైన సోల్ స్టోరీ, ఆకట్టుకునే కథనం మాత్రమే. రీ-షూట్లను తగ్గించి, బడ్జెట్‌పై నియంత్రణ సాధించి, స్టార్ రెమ్యూనరేషన్ల కంటే కంటెంట్‌పై పెట్టుబడి పెట్టినప్పుడే పాన్ ఇండియా కలలు నిజమవుతాయి. లేకపోతే బాక్సాఫీస్ దగ్గర ఈ వందల కోట్ల లెక్కలు తప్పుతూనే ఉంటాయి.

#Tollywood#Telugu Cinema#Pan India Movies#Telugu Film Industry#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి