తెలంగాణ

TG: 25న హైదరాబాద్ లో స్కూళ్లకు సెలవు

రచన: Mahesh3 నిమిషాల పఠనం

TG: మహానగరంలో అత్యంత వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి రంగం సిద్ధమైంది. వేలాదిగా తరలివచ్చే గణనాథుల శోభాయాత్ర, నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది.

TG: మహానగరంలో అత్యంత వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి రంగం సిద్ధమైంది. వేలాదిగా తరలివచ్చే గణనాథుల శోభాయాత్ర, నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నాడు జనరల్ హాలిడే ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవుకు బదులుగా భవిష్యత్తులో ఒక రెండో శనివారం సెలవును రద్దు చేసి వర్కింగ్ డేగా మార్చారు.

ఈ జిల్లాల్లోనే స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..

వినాయక నిమజ్జనం రోజున నగరంలో భారీ ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు, జనసందోహం ఉండనున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెప్టెంబర్ 25న పూర్తిస్థాయిలో సెలవు వర్తిస్తుంది. బ్యాంకులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఆ రోజున మూతపడనున్నాయి.

ట్విస్ట్ ఏంటంటే.. నవంబర్ 14న సెలవు కట్

నిమజ్జనం రోజున సెలవు ఇస్తున్నప్పటికీ.. ఉద్యోగులకు ప్రభుత్వ పని దినాల్లో ఎలాంటి లోటు రాకుండా అధికార యంత్రాంగం పక్కా లెక్కలు వేసింది. సెప్టెంబర్ 25న ఇచ్చిన జనరల్ హాలిడేని భర్తీ చేసేందుకు వీలుగా.. రాబోయే నవంబర్ 14వ తేదీని (రెండో శనివారం) సాధారణ పనిదినంగా ప్రకటిస్తూ నిబంధన విధించింది. సాధారణంగా రెండో శనివారం ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకులకు, బడులకు సెలవు కాగా, ఆ రోజు అందరూ విధులకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా 'జీవో నంబర్ 1396' జారీ చేశారు. నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా అధికార యంత్రాంగం ఇప్పటికే సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది.

#Hyderabad#Telangana#Hyderabad Schools Holiday#September 25 Holiday#Ganesh Immersion#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి