తెలంగాణ

Harish Rao: కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో రైతులకు క్రాప్‌ హాలిడే- హరీశ్ రావు

రచన: NK5 నిమిషాల పఠనం

Harish Rao: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతగానితనంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో క్రాప్‌ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోసుకోవడం లేదని విమర్శించారు.

కేఎల్‌ఐలో ఐదు మోటార్లకు గరిష్ఠంగా మూడు మాత్రమే నడుపుతున్నారని తెలిపారు. మూడు మోటార్లను 24 గంటలు నడిపితే 2,400 క్యూసెక్కుల నీటిని పాలమూరు ప్రాంతానికి అందించే అవకాశం ఉన్నా.. 8 గంటలు మాత్రమే నడిపి 800 క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 4 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తుకునే అవకాశం ఉన్నా ఎందుకు వినియోగించుకోవడం లేదని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

ప్యాకేజీ-3 పనులు పూర్తి చేయాలి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని ప్యాకేజీ-3 పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. మూడేళ్లలో 33 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని పూర్తి చేయకపోవడం వల్ల 50 టీఎంసీల నీటిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పెండింగ్‌ పనులు పూర్తి చేస్తే తక్కువ సమయంలోనే నీటిని ఎత్తిపోసుకోవచ్చన్నారు. కరివెన వరకు రిజర్వాయర్లను నీటితో నింపాలని కోరారు.

కృష్ణా జలాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

కృష్ణా నదిలో తాత్కాలిక వాటా కింద తెలంగాణకు 34 శాతం వాటా ఉందని హరీశ్‌రావు తెలిపారు. ట్రిబ్యునల్‌ ఆదేశాలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. 288 టీఎంసీల నీటిని ఎక్కడ, ఎలా వినియోగించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు క్రాప్‌ హాలిడే ఎందుకు?

గోదావరి జలాల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. దేవాదుల వద్ద నీటిని కేవలం 8గంటలు మాత్రమే ఎత్తిపోస్తున్నారని, పూర్తి స్థాయిలో నీటిని వినియోగిస్తే వరంగల్‌ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చన్నారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పరిధిలో క్రాప్‌ హాలిడే ఎందుకు ప్రకటించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణంతో సాగునీటి విస్తీర్ణాన్ని పెంచిందని హరీశ్‌రావు వెల్లడించారు.

#Harish Rao#Brs#Telangana Congress#Crop Holiday#Krishna Water#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి