తెలంగాణ

Telangana Govt: 2 డీఏలు ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్

రచన: NK4 నిమిషాల పఠనం

Telangana Govt: తెలంగాణ సీఎస్ తో ఉద్యోగ సంఘాల చర్చలు ఫలించాయి. రెండు డీఏలు ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే క్యాబినెట్ భేటీలో డీఏలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎస్ తో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎస్ తో భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు తెలియజేశారు.

Telangana Govt: తెలంగాణ సీఎస్‌ సంజయ్ జాజుతో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపాయి. రెండు డీఏలు ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వచ్చే క్యాబినెట్ భేటీలో డీఏలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎస్‌తో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎస్‌తో భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు తెలియజేశారు.

5 డీఏలు వెంటనే ఇవ్వాలన్నది తమ ప్రధాన డిమాండ్‌గా సీఎస్‌తో చెప్పినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. కాగా, రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. కనీసం మూడు డీఏలు ఇవ్వాలని అడిగామన్నారు. 3.64 శాతంతో ఒక డీఏను, 2.74 శాతంతో రెండో డీఏను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. మూడో డీఏను 3, 4 నెలల్లో ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు.

అలాగే పీఆర్‌సీ త్వరగా ఇవ్వాలని సీఎస్‌ను కోరామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఇక సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరామన్నారు. పీఆర్‌సీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు అధ్యయనానికి ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులతో కమిటీ కమిటీ వేస్తామని సీఎస్ తమతో చెప్పినట్లు ఉద్యో సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్లు, ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అన్నీ త్వరలో పరిష్కారం అవుతాయని భావిస్తున్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.

కాగా, ప్రభుత్వం ప్రకటించిన డీఏల విషయంలో ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వైఖరిపై కొన్ని సంఘాలు అసంతృప్తిగా ఉన్నాయి. ప్రభుత్వం కచ్చితంగా 3 డీఏలు ప్రకటిస్తుందని, పీఆర్‌సీ నివేదికను నెల రోజుల్లో తీసుకొస్తుందని ఆశించాము.. కానీ అలాంటిదేమీ జరగలేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోయారు. బకాయిలపై సర్కార్ నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అనుకున్నాము..

న్యూ పెన్షన్ స్కీమ్ బాగా వేధిస్తున్న సమస్య.. దానిపైనా కమిటీ ప్రకటిస్తారని ఆశాభావంతో చర్చలకు వెళ్లాము.. కానీ మాకు నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం ఒక డీఏపైన మాత్రమే స్పష్టత ఇచ్చింది తప్ప రెండో డీఏపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఇక పీఆర్సీ నివేదిక ఊసే లేకపోవడం బాధాకరం అన్నారు. తామంతా చర్చించుకుని తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.

#Telangana Govt#DA#PRC#Govt Employs#CPS#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి