తెలంగాణ

Hyderabad: బయటపడిన ప్రముఖ బేకరీ బాగోతం.. ఎక్స్‌పైరీ చికెన్‌తో వంటకాలు!..

రచన: Venu•••6 నిమిషాల పఠనం

లాభాల కోసం నాణ్యత లేకుండా జరుగుతున్న ఫుడ్ తింటే శరీరం రోగాలకు కేరాఫ్ గా మారడం ఖాయమని వైద్యులు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నవారు ఎక్కువ అవుతున్నారు. అధికారులు హోటల్స్ పై తనిఖీలు నిర్వహించిన ప్రతి సారి విస్తుపోయే నిజాలు.. కల్తీ, నాణ్యతా లేని ఆహారాలు వెలుగులోకి రావడం తెలిసిందే..

బిజీ బిజీ లైఫ్‌లో సొంతంగా వండుకుని తినే సమయం కూడా చాలామందికి ఉండటం లేదు. దీంతో బయట ఫుడ్‌పై ఆధారపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే ఫుడ్‌ వ్యాపారానికి కాసులు కురిపిస్తోంది. కానీ మనం తింటున్న ఆహారం హెల్తీగా ఉందా? పరిశుభ్రమైన వాతావరణంలో తయారవుతోందా? ఉపయోగిస్తున్న పదార్థాలు నాణ్యమైనవేనా? అనే విషయాలను పట్టించుకునే వారు తక్కువ. దీంతో కొందరు ఫుడ్‌ వ్యాపారులకు ఆడింది ఆట.. పాడింది పాటగా మారుతోంది.

లాభాల కోసం నాణ్యత లేకుండా జరుగుతున్న ఇలాంటి ఫుడ్ తింటే మాత్రం శరీరం రోగాలకు కేరాఫ్ గా మారడం ఖాయమని వైద్యులు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నవారు ఎక్కువ అవుతున్నారు. అధికారులు హోటల్స్ పై తనిఖీలు నిర్వహించిన ప్రతి సారి విస్తుపోయే నిజాలు.. కల్తీ, నాణ్యతా లేని ఆహారాలు వెలుగులోకి రావడం తెలిసిందే.. తాజాగా ఇలాంటి మరో ఘటన హైదరాబాద్‌ అంబర్‌పేటలో బయటపడింది.

స్థానికంగా ఉన్న ప్రముఖ బేకరీ సంస్థ థియోబ్రోమా ఫూడ్స్ సెంట్రల్ కిచెన్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎక్స్పైర్ అయిన చికెన్ వింగ్స్ ను వండి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్లు గుర్తించారు. వాటితో పాటు.. సుమారు 24 కిలోల బంగాళాదుంపలు బూజుపట్టగా, 60 కిలోల పాడైన చాక్లెట్‌ కలెట్స్‌ను అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

అలాగే కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, అక్కడ పురుగులు సంచరిస్తున్నట్లు అధికారులు తేల్చారు. కేక్‌లపై నేరుగా ఏసీ నీరు కారుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా అపరిశుభ్రంగా ఉన్న బేకింగ్ ట్రేలు, మూతలు లేని డస్ట్ బిన్లు, చిందరవందరగా పడి ఉన్న ఆహార పదార్థాలు యి. పాడైన కోడిగుడ్లు ఉండటాన్ని అధికారులు గమనించారు. అంతేకాకుండా ఆహార పదార్థాలను నేలపైనే నిల్వ చేయడం ఆహార భద్రతపై హోటల్ యాజమాన్యానికి ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.

మరోవైపు FSSAI లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించిన ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. లైసెన్స్ కేటగిరీలు, పరిధి విషయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు, తప్పుడు FSSAI కేటగిరీ కింద ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి తగిన చర్యలు చేపట్టారు. ఇక కల్తీ అంటే కేవలం పాలలో నీళ్లు కలపడం లేదా నూనెలో ఇతర పదార్థాలు కలపడం మాత్రమే కాదు.

గడువు ముగిసిన పదార్థాలను ఉపయోగించడం, నాణ్యత లేని ముడి పదార్థాలతో వంట చేయడం, అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఆహారం తయారు చేయడం కూడా వినియోగదారుడి ఆరోగ్యంతో ఆడే ప్రమాదకరమైన ఆట.. ఇలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌, కడుపు సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

అందుకే ఆహార సంస్థలపై తనిఖీలు కేవలం అప్పుడప్పుడు జరిగే చర్యలుగా కాకుండా నిరంతర ప్రక్రియగా మారాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి.. హోటల్‌ ఎంత పెద్దదైనా.. ఆహారం నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదు. కల్తీ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలంటే అధికారులు, వ్యాపారులు, వినియోగదారులు ముగ్గురూ బాధ్యతగా వ్యవహరించాల్సిందే..

#Telangana#Hyderabad#food safety#raid#theobroma central-kitchen#amberpet#violations
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి