భారత్‌ను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి హెచ్చరించారు. సింధు నదీ జలాల విషయంలో భారత్ తన పంతం మానుకోవాలని లేదంటే పాకిస్తాన్ నేరుగా స్పందిస్తుందని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కానీ, పాక్ ప్రధాని వ్యాఖ్యలను భారత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియా, పాక్ మధ్య జరిగిన ప్రతి గొడవలోనూ భారత్ పై చేయి సాధించిన విషయం తెలిసిందే.
ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చిందని ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ప్రస్తావించారు. తాను మధ్యవర్తిత్వం వహించకపోతే పాకిస్తాన్ పని అయిపోయేదని పలుమార్లు అంతర్జాతీయ వేదికల నడుమ, మీడియా ముందు ప్రస్తావించారు.అయితే, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ భూభాగంలోని టెర్రర్ క్యాంపులను ఎత్తివేయాలని, ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగించకూడదని , ఫండింగ్ చేయరాదని భారత్ షరతులు విధించినట్టు సమాచారం.
దానిని పాక్ పట్టించుకోకపోవడంతో భారత్ సింధు నదీ జలాలను నిలిపివేసింది. దీంతో పాక్‌లో తాగు, సాగు నీటి సమస్య ఏర్పడింది. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని ఇప్పటికే పలుమార్లు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ భారత్‌ను హెచ్చరించే ప్రయత్నంచేశారు. తాజాగా ఇస్లామాబాద్‌లో యాద్గార్-ఎ-ఫతా స్మారకాన్ని ప్రారంభించిన సందర్భంగా షెహబాజ్.. భారత్‌ను హెచ్చరించే ప్రయత్నం చేశారు.
తమ దేశానికి వచ్చే నీటిలో ప్రతి చుక్కా చాలా కీలకమని పేర్కొన్నారు. భారత్ తన వైఖరి మార్చుకోకపోతే పాకిస్థాన్ నేరుగా స్పందిస్తుందని హెచ్చరించారు. అలాగే 2025లో భారత్-పాక్ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం చేసినందుకు డొనాల్డ్ ట్రంప్‌కు షెహబాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ జోక్యం వల్ల లక్షలాది ప్రాణాలు నిలిచాయని చెప్పడం గమనార్హం. అయితే, భారత్ మాత్రం 2025 మేలో కాల్పుల విరమణ జరిగిందని, ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చలతోనే అది సాధ్యమైందని, అందులో ట్రంప్ జోక్యం లేదని స్పష్టంచేసింది.
https://x.com/raviprakash_rtv/status/2088152345620439086?s=20


