తెలంగాణ

Telangana Cabinet: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.O.. క్యాబినెట్ కీలక నిర్ణయం

రచన: NK••2 నిమిషాల పఠనం

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.O నిర్వహణకు మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబర్ 7,8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.O సదస్సు నిర్వహించనున్నారు. సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.O నిర్వహణకు మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబర్ 7,8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.O సదస్సు నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమ్మిట్ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది కంటే ఈసారి మరింత ఘనంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని మంత్రి మండలి డిసైడ్ అయ్యింది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తో సదస్సు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిఫెన్స్, ఏరో స్పేస్, ఫార్మాతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా.. సదస్సును నిర్వహించాలన్న దానిపై మంత్రివర్గం డిస్కస్ చేసింది. వివిధ రంగాల్లో తెలంగాణ స్టార్టప్ లు, పరిశ్రమలు సాధించిన విజయాలతో స్టాల్స్ ఏర్పాటునకు నిర్ణయం తీసుకుంది కేబినెట్. అలాగే పలు రంగాల్లో కొత్త ఆవిష్కరణల ప్రదర్శన కూడా ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

#Telangana Cabinet#Telangana Rising Global Summit#Cm Revanth Reddy#Swechaa News#Investments
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి