Varanasi: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా అంటే హీరో ఏళ్ళ తరబడి లాకవ్వాల్సిందే. ఒక్కసారి రాజమౌళి సినిమా కమిటైతే, అది పూర్తయ్యే వరకూ మరో సినిమా ఒప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఆ సినిమా కోసం ప్రత్యేకించి మేకోవర్ కోసం అన్నీ రకాలుగా సిద్ధమవ్వాలి. ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్, ఎన్‌టిర్ కూడా ఇలాగే తయారయ్యారు. ఇది పూరైయ్యేవరకూ మరో సినిమాను చెయ్యలేదు. ఇప్పుడు, మహేష్ కూడా అంతే.
రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న గ్లోబల్ మూవీ 'వారణాసి'. ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, విలన్ కుంభ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు 4 నెలల ముందు నుంచే సిద్ధమవనున్నారట. 120 దేశాలలో 20 భాషలలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇలా గ్లోబల్ వైడ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట.
నిజంగా, రాజమౌళి ప్లాన్స్ ఎవరూ ఊహించలేరు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో నిర్వహించారో అందరికీ తెలిసిందే. ఎన్‌టిర్, చరణ్ కలిసి కొన్ని స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. రాజమౌళి తో కలిసి కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. 5 ప్రధాన భాషలలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ని నిర్వహించారు. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, ఆలియా భట్‌లతో కొన్ని ఇంటర్వూస్ జరిపారు. దీనికే, అమ్మో రాజమౌళి అన్నారు.
ఇప్పుడు, 'వారణాసి' కోసం గ్లోబల్ వైడ్ ప్రమోషన్స్ ప్లానింగ్ చూస్తే హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా వావ్ అనాల్సిందే. జర్మనీ వంటి దేశాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో కంటెంట్ క్రియేట్ చేయనున్నారు. అంతేకాదు, ఆయా దేశాలలో ఉన్న పాపులర్ మీడియా సంస్థలలో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం మహేష్, రాజమౌళి 4 నెలల సమయాన్ని కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే, నిజమైతే రాజమౌళి సత్తా ఈసారి ఈ 120 దేశాలకి తెలియబోతుంది.


