National

JIO : జియో ఐపీవోకు భారీ స్పందన.. 3.68 రెట్లు సబ్‌స్క్రైబ్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఇవాళ పబ్లిక్ ఇష్యూకు రాగా, మార్కెట్లో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. రూ. 30,213 కోట్ల విలువైన ఈ భారీ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయి సరికొత్త రికార్డును సృష్టించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఇవాళ పబ్లిక్ ఇష్యూకు రాగా, మార్కెట్లో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. రూ. 30,213 కోట్ల విలువైన ఈ భారీ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయి సరికొత్త రికార్డును సృష్టించింది.క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగంలో ఇన్వెస్టర్లు విపరీతమైన ఆసక్తి చూపించారు. ఐపీఓ ప్రారంభమైన ఉదయం 10 గంటల సమయానికే QIB కోటా 2.86 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, ఆ తర్వాత అది 3.68 రెట్లకు పైగా దూసుకెళ్లింది.

సాధారణ రిటైల్ మదుపరుల నుంచి మొదటి రోజు ఉదయం స్పందన కాస్త నెమ్మదిగా ఉన్నట్టు తెలిసింది. పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందే (అక్టోబర్ 19న) యాంకర్ ఇన్వెస్టర్ల బుక్ కోసం ఏకంగా రూ. 2.5 లక్షల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఆఫర్ చేసిన దానికంటే దాని విలువ 30 రెట్లు ఎక్కువ. దీని ద్వారా కంపెనీ ఇప్పటికే రూ. 8,110 కోట్లను సమీకరించింది. ఇందులో బ్లాక్‌రాక్, ఫిడిలిటీ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు LIC, SBI, HDFC వంటి దేశీయ దిగ్గజాలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టాయి.

బిడ్డింగ్ మొదలైన తొలిరోజే మొత్తం ఐపీవో 3.68 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడంతో జియో ప్లాట్‌ఫామ్స్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. సంస్థ ఉద్యోగుల కోసం కేటాయించిన ఎంప్లాయ్ కోటా మొదటి రోజే పూర్తిగా 100 శాతం సబ్‌స్క్రైబ్ అయి దూసుకెళ్లింది. రిటైల్ ఇన్వెస్టర్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సైతం పెద్ద ఎత్తున బిడ్లు దాఖలు చేయడంతో మొదటి రోజే ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తి స్థాయిలో పూర్తయింది.

ఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ అక్టోబర్ 23 వరకు జరగనుంది.టెలికాం, డిజిటల్ సేవల రంగంలో జియో కలిగి ఉన్న పటిష్టమైన మార్కెట్ వాటా, స్థిరమైన వృద్ధి,భవిష్యత్ డిజిటల్ విస్తరణ ప్రణాళికలు ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసాన్ని నింపాయి. రానున్న రెండు రోజుల్లో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) నుంచి కూడా భారీ ఎత్తున బిడ్లు వెల్లువెత్తే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఈ ఐపీవో సరికొత్త రికార్డులను నెలకొల్పనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

#JIO#plotforms#IPO#business#reliance industries#stockmarket#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి