తెలంగాణ

Congress: మంచిర్యాలలో హైటెన్షన్.. కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు

రచన: NK••4 నిమిషాల పఠనం

Congress: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి భగ్గుమంది. కాంగ్రెస్ నేతల మధ్య గ్రూప్ వార్ తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మరో నేత జగన్ మోహన్ రావు వర్గీయుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన పలువురికి గాయాలయ్యాయి.

Congress: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి భగ్గుమంది. కాంగ్రెస్ నేతల మధ్య గ్రూప్ వార్ తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మరో నేత జగన్ మోహన్ రావు వర్గీయుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో జగన్ మోహన్ రావు ఇంటిపై ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేస్తారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జగన్ మోహన్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించారు.

సద్దుల బతుకమ్మ రోజున ఘర్షణ

మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ లో నాలుగు రోజులుగా ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. సద్దుల బతుకమ్మ రోజున తాళ్లపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, జగన్ మోహన్ రావు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అది మరువక ముందే దసరా రోజున కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి పలువురు గాయపడ్డారు.

జగన్ మోహన్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు

ప్రేమ్ సాగర్ వర్గీయులపై దాడి చేసిన జగన్ మోహన్ రావు వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. జిల్లా కేంద్రంలోని జగన్ మోహన్ రావు ఇంటిపై ప్రేమ్ సాగర్ వర్గీయులు దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తెల్లవారుజాము నుంచే జగన్ మోహన్ రావు ఇంటి చుట్టూ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఈ గొడవలకు జగన్ మోహన్ రావే కారణం అని ప్రేమ్ సాగర్ వర్గం ఆరోపించింది. లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లోనూ పోలీసుల పహారా కొనసాగింది.

ముందు జాగ్రత్తగా పోలీసుల పహారా

సద్దుల బతుకమ్మ రోజున దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో ప్రేమ్ సాగర్, జగన్ మోహన్ రావు వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. కాగా, ఈ హైటెన్షన్ వాతావరణం దండేపల్లి నుంచి మంచిర్యాలకు చేరుకుంది. ఎంపీ వంశీ కృష్ణ అనుచరుడు జగన్ మోహన్ రావు ఇంటిపై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కార్యకర్తలు సమన్వయం పాటించాలని, దాడులకు దిగొద్దని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు.

#Congress#Saddula Bathukamma#Thallapet Village#Dandepalli#Mancherial District#Premsagar Rao#Jaganmohan Rao#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి