ఏపీ

రౌడీయిజం, అరాచకాలపై ఉక్కుపాదం మోపాలి: సీఎం చంద్రబాబు

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని, పోలీసులు రౌడీయిజం, అరాచకాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.  మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ (APSP) బెటాలియన్‌లో నిర్వహించిన 'పోలీసు అమరవీరుల సంస్మరణ దినం' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.

 ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని, పోలీసులు రౌడీయిజం, అరాచకాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.  మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ (APSP) బెటాలియన్‌లో నిర్వహించిన 'పోలీసు అమరవీరుల సంస్మరణ దినం' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నేరస్థులకు పోలీసు యూనిఫాం చూస్తే ఒణుకు పుట్టాలని, అదే సమయంలో బాధితులకు పూర్తి భరోసా కల్పించేలా ప్రవర్తించాలని హితవు పలికారు.

 ‘భద్రత, భరోసా ఉన్న ప్రాంతాలకే పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు వస్తాయి. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెంది యువతకు విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అందుకే నా పాలనలో ఎప్పుడూ శాంతిభద్రతలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను’ అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. గతంలో ఫ్యాక్షనిజం, నక్సలిజం, మత ఘర్షణలను సమర్థవంతంగా అణచివేసిన చరిత్ర ఏపీ పోలీసులకు ఉందని కొనియాడారు.

 మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేరాలను నిరోధించడమే ఉత్తమ పోలీసింగ్ అని వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతను దర్యాప్తులో భాగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గంజాయి, మాదకద్రవ్యాల నిరోధానికి ఏర్పాటు చేసిన 'ఈగల్' బృందాల పనితీరును అభినందిస్తూ.. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడాలంటేనే భయపడేలా కఠిన వాతావరణాన్ని సృష్టించాలని డీజీపీ, ఉన్నతాధికారులను ఆదేశించారు.

 పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో విధులు నిర్వహించే పోలీసులు యోగా, ధ్యానం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ‘షహీద్ పుస్తక్ టోలీ’, ‘అమరులు వారు’ అనే ప్రత్యేక సంస్మరణ పుస్తకాలను ఆవిష్కరించి, ఆక్టోపస్ మరియు ఫోరెన్సిక్ విభాగాల ఆధునిక ఆయుధాల స్టాళ్లను సందర్శించారు.

 

#APPoliceFlagDay#ChandrababuNaidu#APPolice#LawAndOrderAP#VangalapudiAnita#HarishKumarGupta#APNews2026#APPolitics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి