తెలంగాణ

TG : కొండా సురేఖ విషయంలో అధిష్టానం యూటర్న్?

రచన: Kumar5 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించే విషయంలో అధిష్టానం యూటర్న్? తీసుకున్నట్టు సమాచారం. కొండా సురేఖకు ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు, ఒక అగ్రనేత మద్దతు పలికినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించే విషయంలో అధిష్టానం యూటర్న్? తీసుకున్నట్టు సమాచారం. కొండా సురేఖకు ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు, ఒక అగ్రనేత మద్దతు పలికినట్టు తెలుస్తోంది. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకున్నా జాగ్రత్తగా వ్యవహరించాలని అధిష్టానాన్ని రాష్ట్ర కీలక నేతలు కోరినట్టు తెలిసింది.

మంత్రి కొండా సురేఖపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని మరో ఏఐసీసీ కార్యదర్శి అధిష్టానానికి సూచించినట్టు సమాచారం. ఆమెను కేబినెట్ నుంచి తొలగిస్తే తీవ్ర రాజకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ముందస్తు హెచ్చరిక చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆమె పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని, దానివల్ల ఉపఎన్నిక అనివార్యమై రాష్ట్రంలో పార్టీపై ప్రతికూల ప్రభావం పడుతుందని కీలక నేతలు అధిష్టానానికి సూచించినట్టు సమాచారం.

ఏఐసీసీ చీఫ్ ఖర్గే, AICC ప్రధాన కార్యదర్శి కేసీ ణుగోపాల్‌కు తమ అభిప్రాయాలను తెలియజేయడంతో పాటు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సురేఖతో సంప్రదింపులు జరపాలని ఇద్దరు రాష్ట్ర మంత్రులు విన్నవించినట్టు తెలిసింది. దీంతో కొండా సురేఖపై వేటు వేస్తే బీసీ సామాజికవర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని అధిష్టానం వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. కొండా సురేఖకు తన కేబినెట్ నుంచే మద్దతు పెరగడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆందోళనలో ఉన్నట్టు సమాచారం.

సమావేశానికి హాజరైన కొండా..

కొండా సురేఖ అంశంలో ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కేసీ వేణుగోపాల్, ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశం అయినట్టు తెలిసింది. వారి భేటీలో కమిటీ నివేదిక గురించి వివరాలు సేకరించిన అధిష్టానం.. ఆ తర్వాత కొండాతో సమావేశం అయినట్టు తెలిసింది.అయితే, క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రి కొండాను అధిష్టానం వివరణ కోరగా.. ఆమె తన వెర్షన్ వినిపించినట్టు సమాచారం.కాగా, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

పీసీసీ చీఫ్‌తో సీఎం రేవంత్ భేటీ..

మంత్రి కొండా సురేఖపై చర్యల నేపథ్యంలో ఢిల్లీలో వరుస భేటీలు జరుగుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి... తెలంగాణ పీసీసీచీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో భేటీ అయ్యారు.నిన్న కేసీ వేణుగోపాల్‌తో జరిగిన భేటీ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. మరికాసేపట్లో మీనాక్షి నటరాజన్‌తో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ కానున్నారు.అనంతరం కేసీ వేణుగోపాల్‌తోనూ భేటీ కానున్నట్టు సమాచారం.అయితే, కొండాపై చర్యలు తీసుకునే అంశంలో పీసీసీ చీఫ్ తన వెర్షన్ సైతం అధిష్టానం పెద్దలకు వివరించనున్నట్టు సమాచారం.

https://x.com/TeluguScribe/status/2095036804642845069?s=20

#konda sureka#cm revanth reddy#congress#AICC#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి