సినిమా

Raviteja: 200 కోట్ల క్లబ్‌లో "ఇరుముడి"..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Raviteja: ఇరుముడి కాసుల వర్షానికి అసలు అడ్డే ఉండటం లేదు. వర్షాకాలంలో వర్షాలు పడాలి గానీ, ఇలా కాసుల వర్షం పడటం ఏంటో.. అని ఫిల్మ్ సర్కిల్స్‌లో రవితేజ ఇరుముడి సినిమా గురించి సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంత భారీ హిట్ సినిమా అయినా మొదటి వారం తర్వాత చిన్నగా కలెక్షన్స్‌లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ, రవితేజ ఇరుముడి సినిమా మాత్రం బుకింగ్స్‌లో అదే జోరు కొనసాగిస్తోంది. ఫలితంగా, ఇప్పుడు ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఈ నేపథ్యంలో మేకర్స్ అధికారికంగా ఇరుముడి చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా సెప్టెంబర్ 18 నుంచి ఓటీటీ లో వచ్చేస్తుంది. అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయినా, కూడా ఎక్కడా కలెక్షన్స్ తగ్గడం లేదు. వినయాకచవితి వరకూ భారీ చిత్రాలు లేకపోవడంతో..మరో 10 రోజుల పాటు ఈ జోరు కనిపించేలా ఉంది.

ఈ స్థాయి హిట్ రవితేజ అందుకోని ఎన్నో ఏళ్ళవుతోంది. ఒకదశలో రవితేజ సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి వెళ్లారు. ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ అవలేదు. అయినా, ఇరుముడి మళ్ళీ మన మాస్ మహారాజాను సక్సెస్ ట్రాక్ ఎక్కించి ఫాంలోకి లాక్కొచింది. 2026 లో మన శంకరవరప్రసాద్‌గారు తర్వాత ఆ స్థాయి హిట్ దక్కింది ఈ సినిమాకే. ఇంకా, చెప్పాలంటే ఆ సినిమా కంటే ఎక్కువే లాభాలను తెచ్చింది..ఇంకా తెస్తోంది.

రవితేజ, సాయి కుమార్ తప్ప మరో గొప్ప నటీనటులు లేని సినిమా ఇరుముడి. హీరోయిన్ కూడా ఇంతకముందు చేసిన సినిమాల ఫలితంతో ఎవరికీ అంతగా తెలియదు. సాయి కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్..హీరో రవితేజ మాత్రమే పేరున్న వాళ్ళు. మిగతావాళ్ళు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. కేవలం కథ, కథనాలు..నటీనటుల పర్ఫార్మెన్స్ మాత్రమే సినిమాను ఈ స్థాయి హిట్ అయ్యేలా చేశాయి. ఏదేమైనా, రవితేజ కంబ్యాక్ మాత్రం నెవర్ బిఫోర్ రేంజ్.

#raviteja#irumudi#irumudi blockbuster#shiva nirvana#priya bhavani shankar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి