రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న వేళ .. కొండా సురేఖను తప్పించి ఆమె స్థానంలో మరో బీసీకి చాన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారు. వీరంతా కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యి మంత్రి పదవి నుంచి కొండాను ఉంచాలా? తొలగించాలా? అనే అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం.
ఇదిలాఉండగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వీడ్కోలు చెప్పనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ ఎన్నికలు ఉన్నందున ఆమె అక్కడకు వెళ్లేందుకు నిర్ణయించకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి మీనాక్షీ నటరాజన్ తప్పుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ పూర్తయ్యాక తెలంగాణ నుంచి వెళ్తారని తెలుస్తోంది.
ఆమెకు త్వరలోనే పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై మీనాక్షీ నటరాజన్ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో తనకు రాజ్యసభ అవకాశం దక్కకుండా..కొందరు రాష్ట్ర నేతలు అడ్డుకున్నారన్న ఆమె తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు సమాచారం.
https://x.com/pulsenewsbreak/status/2094997093073211809?s=20
అందుకే తనకు తెలంగాణలో కొనసాగడం ఇష్టం లేదని రాహుల్‌గాంధీకి ఆమె స్పష్టం చేసినట్టు ప్రచారం సాగుతోంది. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్‌పై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించగా.. పంజాబ్ పరిస్థితులపై అధ్యయనానికి ముగ్గురు సభ్యులతో పరిశీలకుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో మీనాక్షీ నటరాజన్, అజయ్ మాకెన్, భజన్‌లాల్ జాతవ్‌కు చోటు కల్పించడంతో మీనాక్షి రాష్ట్రం విడిచి వెళ్లనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే పంజాబ్ రాజకీయాలపై సమీక్షల్లో మీనాక్షీ నటరాజన్ బిజీగా ఉన్నట్టు సమాచారం. కాగా. ఇక్కడ ‘సర్’ ప్రక్రియ ముగిసిన వెంటనే పంజాబ్ రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, అభ్యర్థుల ఎంపిక నుంచి ఫైనల్ చేసే వరకు ముఖ్య పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.









