ఏపీలో క్లోరోక్విన్ బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. ఆస్పత్రులు విద్యార్థులతో నిండిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 71మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. మాత్రల డోస్ ఎక్కువ కావడంతో ఇద్దరు విద్యార్థులు ఇప్పటికే మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విద్యార్థులకు చికిత్స జరుగుతోంది. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన ఏపీలో భారీ కుదుపును తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
పిల్లల ప్రాణాల మీదకు రావడానికి ఏపీ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే విద్యార్థులు ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్నారని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తుస్తున్నారు. వివరాల్లోకివెళితే.. ఇటీవల మలేరియా జ్వరంతో ఓ యువతి మృతి చెందగా ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విద్యార్థినులకు ‘క్లోరోక్విన్’ మాత్రలు పంపిణీ చేసినట్టు తెలిసింది.
అవి వేసుకున్న కాసేపటికే వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఓ విద్యార్థిని మృతి చెందింది.అలాగే క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న మరికొందరు విద్యార్థినులు సైతం కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు.వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది.తాజాగా పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో క్లోరోక్విన్ మాత్రలు వికటించి 71 మంది అస్వస్థతకు గురయ్యారు.
https://x.com/pulsenewsbreak/status/2094842656245616707?s=20
బాధితులకు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజా పరిస్థితులను మంత్రి సత్యకుమార్‌కు కలెక్టర్ దినేష్‌కుమార్ వివరించారు.భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. బాధితులకు వైద్య సేవల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించినట్టు సమాచారం.










