సినిమా

Chiranjeevi: సంకల్ప సాధకుడు "కళ్యాణ్ బాబు"

రచన: Anshu4 నిమిషాల పఠనం

Chiranjeevi: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ రోజు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా పవన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్ట్ అటు మెగా అభిమానులను, ఇటు సినీ లవర్స్, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

చిరు రాసిన పోస్ట్ లో చిన్నప్పటి నుంచే ‘కళ్యాణ్ బాబు’లో ఉన్న నిబద్ధత, ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధిని దగ్గరుండి చూశాను..అని తెలిపారు. మా కుటుంబం మీద ఎంత ప్రేమను చూపిస్తాడో, తనని నమ్మిన ప్రజల మీద కూడా అంతే ప్రేమను చూపే గుణం పవన్‌ది అని రాసుకొచ్చారు. అలాగే, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల పురోగతి, పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో అంకితభావంతో పనిచేస్తూ పరిపాలనలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేస్తున్నాడు అని పొంగిపోయాడు.

ఇలా, ఓ సుధీర్ఘమైన నోట్ రాశారు పవన్ కళ్యాణ్ గురించి ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం, ఈ పోస్ట్ అటు సోషల్ మీడియాలో ఇటు మీడియా మాధ్యమాలలో ప్రసారం అవుతూ బాగా వైరల్ అవుతోంది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడులకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదానాలు, అన్నదానాలు వంటి కార్యక్రమాలను చేపట్టారు పవన్ అభిమానులు.

ఇక, పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ఆయన ఓజీ సినిమాతో వచ్చి కెరీర్‌లోనే భారీ హిట్ అందుకున్నాడు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. అలాగే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమాను చేయనున్నాడు. అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. కానీ, ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మాత్రం ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది.

#pawan kalyan#pawan kalyan bdy spl#chiranjeevi#apdcm pawan kalyan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి