తెలంగాణ

TG : మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు మరో శుభవార్త

రచన: Kumar4 నిమిషాల పఠనం

వివిధ కారణాల వలన మూడు నెలల రేషన్ అందుకోని సామాన్యులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ శుభవార్త చెప్పింది. రేషన్ పంపిణీ ప్రక్రియ గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించింది. పేదలు, సామాన్యులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని తెలిపింది.

వివిధ కారణాల వలన మూడు నెలల రేషన్ అందుకోని సామాన్యులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ శుభవార్త చెప్పింది. రేషన్ పంపిణీ ప్రక్రియ గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించింది. పేదలు, సామాన్యులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని తెలిపింది.ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వర్షాలు సమృద్ధిగా కురవలేదు. పంటలు కూడా సరిగా పండలేదని సమాచారం.నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పేదలు ఇబ్బంది పడకూడదని ఒకేసారి మూడు నెలల కోటా కింద రేషన్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించాయి.

ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్.. మూడు నెలలకు సంబంధించిన కోటాను ఒకే విడతలో ఆగస్టు 31లోపు పంపిణీ చేస్తామని గతంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.ఒకేసారి మూడు నెలల సరుకులు ఇవ్వడం వల్ల రేషన్ దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడటం, మరోవైపు రాఖీ పౌర్ణమి పండుగ సెలవుల నేపథ్యంలో పలువురు లబ్ధిదారులు తమ సొంతూళ్లకు వెళ్లడంతో అనుకున్న గడువులోగా పూర్తిస్థాయిలో రేషన్ తీసుకోలేకపోయారని తెలిసింది.దీనికి తోడు స్టాక్ కూడా విపరీతంగా ఉండిపోవడంతో కోటాను ఖాళీ చేయాలని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రేషన్ తీసుకోని వారికోసం గడువును పొడగించినట్టు సమాచారం. ఆగస్టు 31తో గడువు ముగిసినా.. సెప్టెంబర్ 5 తేదీ వరకు గడువును పెంచడంతో లబ్ధిదారులకు మేలు జరగనుంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం వరకు అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ యథావిధిగా కొనసాగుతుందని ప్రజాపంపిణీ వ్యవస్థ స్పష్టం చేసింది.ఇంకా మూడు నెలల కోటాను తీసుకోని అర్హులైన లబ్ధిదారులు నిర్దేశిత గడువులోగా సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి బియ్యాన్ని తీసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

కాగా, మూడు నెలల రేషన్ పంపిణీ ప్రకటించిన ప్రతీసారి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా క్యూలైన్లు,వాటికి తోడు సర్వర్ సమస్యలతో రోజువారీగా లైన్లలో నిలబడలేక సతమతం అవుతున్నామని కొందరు వృద్ధులు, మధ్యవయస్సు వారు సైతం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బయోమెట్రిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

#three months ration#date extended#telangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి