Health

Health: శరీరంపై పులిపిరులు రావడానికి కారణం ఏంటి?

రచన: Venu5 నిమిషాల పఠనం

పులిపిరులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడమే కాకుండా.. మన శరీరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కూడా వ్యాపించే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.. అయితే అన్ని పులిపిరులు ఒకేలా ఉండవని నిపుణులు తెలియచేస్తున్నారు..

శరీరంపై చిన్నగా, గట్టిగా కనిపించే పులిపిరులను చాలామంది సాధారణ చర్మ సమస్యగానే భావిస్తారు. కానీ హ్యూమన్ పాపిలోమా వైరస్.. అంటే HPV వల్ల ఇవి వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మంపై చిన్నపాటి కోతలు, గీతలు లేదా రాపిడుల ద్వారా HPV వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. పులిపిరులు ఏర్పడే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు..

అలాగే ఈ పులిపిరులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడమే కాకుండా.. మన శరీరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కూడా వ్యాపించే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.. అయితే అన్ని పులిపిరులు ఒకేలా ఉండవని నిపుణులు తెలియచేస్తున్నారు.. సాధారణంగా అవి ఐదు రకాలని చెబుతూ వాటి గురించి వివరిస్తున్నారు..

అందులో మొదట కామన్ వర్ట్స్ పులిపిరులని.. ఇవి సాధారణంగా చేతులు, వేళ్లు, మోచేతులపై కనిపిస్తాయని, ఇవి గరుకుగా, ఉబ్బెత్తుగా ఉంటాయని వివరిస్తున్నారు. అలాగే రెండోది.. ప్లాంటార్ వర్ట్స్ పులిపిరులు.. ఇవి అరికాళ్లపై ఏర్పడతాయని, నడిచేటప్పుడు శరీర బరువు పడటం వల్ల ఇవి లోపలికి పెరిగి నొప్పిని కలిగించవచ్చని పేర్కొంటున్నారు.. ఇక మూడవది.. ఫ్లాట్ వర్ట్స్ పులిపిరులు..

ఇవి చిన్నగా, చదునుగా ఉంటాయని, ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై ఎక్కువ సంఖ్యలో కనిపించే అవకాశం ఉంటుందని తెలుపుచున్నారు.. అలాగే నాలుగోవ రకం పులిపిరులు.. ఫిలిఫార్మ్ వర్ట్స్.. ఇవి దారం లేదా చిన్న పీచుల్లా కనిపిస్తాయి. ముఖ్యంగా కనురెప్పలు, పెదవులు, మెడ ప్రాంతాల్లో ఏర్పడవచ్చని అంటున్నారు.. ఇక ఏదోవది.. జెనిటల్ వర్ట్స్ అనే పులిపిరులు.. ఈ రకం పులిపిరులు జననాంగాల చుట్టుపక్కల ఏర్పడతాయి. ఇవి కొన్ని రకాల లైంగికంగా సంక్రమించే HPV వైరస్‌ల వల్ల వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

ఇక పులిపిరులు రాకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇతరుల పులిపిరులను తాకకుండా ఉండటం, తువ్వాళ్లు, రేజర్లు వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు.. ఇప్పటికే పులిపిరులు ఉంటే.. వాటిని బ్లేడ్‌తో కోయడం లేదా స్వయంగా తొలగించేందుకు ప్రయత్నించడం వంటివి ప్రమాదకరం అని.. అవసరాన్ని బట్టి వైద్యులు సాలిసిలిక్ యాసిడ్, క్రయోథెరపీ, ఎలక్ట్రోకాటరీ లేదా లేజర్ వంటి చికిత్సా విధానాల ద్వారా తొలగించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు..

అయితే చర్మంపై కనిపించే ప్రతి పులిపిరులు ప్రమాదం అని నిర్ధారించలేం. అవి వేగంగా పెరగడం, రక్తస్రావం కావడం, రంగు మారడం లేదా నొప్పి కలగడం వంటి లక్షణాలు ఉంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. కాబట్టి.. శరీరంపై పులిపిరులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా, సొంత వైద్యం కాకుండా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమ మార్గంగా పేర్కొంటున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి!..

#Health#skin#HPV virus#Common warts#hands#fingers#elbows#body#causes warts
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి