సినిమా

Heroines: సొంత గొంతే ఇష్టం..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Heroines: సినిమాలో హీరో పాత్రలకి దాదాపు తమ సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. కానీ, హీరోయిన్స్..ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం భాష సమస్య వల్ల ఇతర డబ్బింగ్ ఆర్టిస్టుల మీద ఆధారపడుతున్నారు. అయితే, గత కొంతకాలంగా మన హీరోయిన్స్ మాత్రం వేరే వాళ్ల గొంతు మీద ఆధారపడటం లేదు. భాష రాకపోయినా కూడా పట్టుదలతో నేర్చుకొని తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. వారిలో, సాయి పల్లవి..అనుపమ పరమేశ్వరన్..కీర్తి సురేష్ ఉండటం విశేషం.

సాయి పల్లవి:

మొదటి సినిమా ఫిదా నుంచి సాయి పల్లవి తెలుగు పదాలకి అర్థం తెలుసుకొని అసిస్టెంట్ సహాయంతో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఆమె వాయిస్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తెలుగులో చేసిన ప్రతీ సినిమాకి సాయి పల్లవి సొంత గొంతునే నమ్ముకుంది. ఇప్పుడు, మైథలాజికల్ మూవీ రామాయణ కోసం కూడా హిందీలో ఇదే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది.

కీర్తి సురేష్:

కీర్తికి తెలుగు భాష మీద మంచి పట్టుంది. రాయడం రాకపోయినా..మాట్లాడటం బాగా వచ్చు. దాంతో, డబ్బింగ్ విషయంలో అసలు ఇంకొకరిపైన ఆధారపడలేదు. మహానటి సినిమా సమయంలో కీర్తి డబ్బింగ్ చెప్తున్న వీడియో బాగా వైరల్ అయింది. అరుపులు, కేకలతో డబ్బింగ్ చెప్తున్న కీర్తి వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఏ భాషలో కీర్తి సినిమా చేసినా తన సొంతగొంతుతోనే డబ్బింగ్ చెప్తోంది. మహానటి తర్వాత సౌత్ భాషలతో పాటు హిందీలోనూ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది.

అనుపమ:

ప్రేమమ్ సినిమాతో సినిమా ఇండట్రీలోకి వచ్చిన అనుపమ పరమేశ్వరన్..తెలుగులో అ.ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా నుంచే ఆమె సొంత గాత్రం ఉపయోగిస్తోంది. మలయాళీ అయినా ఈ హీరోయిన్స్..తెలుగు భాషను, కొన్ని సినిమాల కోసం తెలంగాణ యాసను నేర్చుకొని మరీ తమ పాత్రలకి డబ్బింగ్ చెప్పుకుంటూ ఇండస్ట్రీలో అందరినీ ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం, అనుపమ భోగి సినిమాకి డబ్బింగ్ చెప్తున్న పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

#Sai Pallavi#Anupama Parameshwaran#Keerthy Sureash#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి