సినిమా

Tollywood: పెద్ద హీరోలతో సినిమా..ఫ్లాపైతే దర్శకుడికి చుక్కలేగా!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Tollywood: స్టార్ హీరోలతో సినిమా చేయడం అంటే దర్శకులకి పెద్ద సవాలే. వర్కౌట్ అయితే దర్శకుడి రేంజ్ కూడా ఎక్కడికో వెళుతుంది. మన రాజమౌళి, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా. తేడా కొట్టి గనక సినిమా ఫ్లాపైతే అదే దర్శకుడి కెరీర్ తలకిందులవుతుంది. మన మారుతి, క్రిష్ లాంటి దర్శకుల మాదిరిగా. కానీ, ఇక్కడ ఎవరూ ఫ్లాప్ కావాలని కోరుకోరు. ప్రేక్షకులను మెప్పించలేకపోవడం వల్లే జీవితాలు తారుమారవుతాయి. అదే, జరిగితే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిందే.

మారుతి:

ఈరోజుల్లో, బస్ స్టాప్ లాంటి చిన్న చిత్రాలతో సక్సెస్ కొట్టి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మారుతి దాసరి..ప్రేమకథా చిత్రమ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. నానితో చేసిన భలే భలే మగాడివోయ్ సినిమా ఆయన కెరీర్‌ను మార్చేసింది. అయితే, పెద్ద హీరోలతో చేసిన సినిమాలు మాత్రం దెబ్బకొట్టాయి. వెంకటేష్‌తో బాబు బంగారం, గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ సినిమాలు చేసిన మారుతికి ఫ్లాప్స్ పడ్డాయి. అయినా, ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం చాలా గ్రేట్. కానీ, ది రాజాసాబ్ రూపంలో భారీ ఫ్లాప్ ఇచ్చాడు మారుతి. అంతే, మళ్ళీ ఆయన కొత్తవాళ్లతో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడట. అంటే, మళ్ళీ జీరో నుంచే స్టార్ట్ చేసినట్టు అర్థమవుతోంది.

క్రిష్:

మనకున్న అతికొద్ది మంచి అభిరుచి గల దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. గమ్యం, వేదం, కంచె, కృష్ణం వందే జగద్గురం, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలతో గొప్ప దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నాడు. కానీ, భారీ అంచనాలతో మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. వైష్ణవ్ తేజ్ తో చేసిన కొండపొలం, అనుష్క శెట్టితో చేసిన ఘాటి ఫలితాలు తేడాకొట్టాయి. ఇప్పుడు, క్రిష్ కొత్తవాళ్ళతో సినిమా చేస్తున్నాడు.

శ్రీకాంత్ ఓదెల:

యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇటీవల నేచురల్ స్టార్ నానితో ది ప్యారడైజ్ అనే పాన్ ఇండియా సినిమాను చేసిన సంగతి తెలిసిందే. దీనికి ముందు చేసిన దసరా హిట్ అన్న మాటే గానీ, పెద్ద కమర్షియల్ సక్సెస్ అని మాత్రం చెప్పలేము. అయినా, నాని ఇంకో ఛాన్స్ ఇచ్చి పాన్ ఇండియా ఛాన్స్ ఇవ్వడమే కాదు, ఏకంగా మెగాస్టార్‌తో ప్రాజెక్ట్‌ను చేతిలో పెట్టాడు. కానీ, ది ప్యారడైజ్ సినిమా విషయంలో పడ్డ తడబాటుకు శ్రీకాంత్ కెరీర్ డైలమాలో పడిందంటున్నారు. దాదాపుగా, శ్రీకాంత్ ఓదెల-చిరు సినిమా హోల్డ్ అయిందంటున్నారు. పెద్ద స్టార్‌తో అవకాశం రావడం ఒక వరం..అదే పెద్ద స్టార్ సినిమా ఫ్లాపైతే దర్శకులకి శాపంగా మారుతోంది.

#Maruthi#Krish#Srikanth Odela#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి