National

AmitShah: నవంబర్ 1న విపక్షాల ర్యాలీపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

AmitShah: నవంబర్ 1న ఢిల్లీ రోడ్లపై ప్రతిపక్ష ఇండియా కూటమి తలపెట్టిన ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ ర్యాలీపై బీజేపీ ప్రత్యేకంగా గురిపెట్టింది. దేశ రాజధాని వేదికగా విపక్షాలు భారీ ఎత్తున జనసమీకరణ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తుంటే.. ఆ ప్లాన్‌ను ఆదిలోనే తుంచేయడానికి ఆ పార్టీ అపర చాణక్యుడు,

AmitShah: నవంబర్ 1న ఢిల్లీ రోడ్లపై ప్రతిపక్ష ఇండియా కూటమి తలపెట్టిన ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ ర్యాలీపై బీజేపీ ప్రత్యేకంగా గురిపెట్టింది. దేశ రాజధాని వేదికగా విపక్షాలు భారీ ఎత్తున జనసమీకరణ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తుంటే.. ఆ ప్లాన్‌ను ఆదిలోనే తుంచేయడానికి ఆ పార్టీ అపర చాణక్యుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. విపక్షాల వ్యూహాలకు గండికొట్టి, వారి నిరసనల వేడిని జాతీయ స్థాయిలో తగ్గించడమే లక్ష్యంగా కమలదళం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలోనే ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా సమక్షంలో హై-లెవల్ మీటింగ్ జరిగింది. పార్టీ నేషనల్ అధికార ప్రతినిధులు, మీడియా కోఆర్డినేటర్లు, ఐటీ సెల్, సోషల్ మీడియా ముఖ్య నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించి, వాటి వెనుక ఉన్న డొల్లతనాన్ని ఎండగట్టాలని అమిత్ షా తన టీమ్‌కు పక్కా రోడ్‌మ్యాప్ ఇచ్చారని చెబుతున్నారు.

ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలన్న దానిపైనే బీజేపీ పూర్తిగా గురిపెట్టింది. ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ అని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండదన్న స్పష్టమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించి ఇలా రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్నారని ఎదురుదాడి చేయాలని ఫిక్స్ అయ్యారు. నవంబర్ 1 ర్యాలీ ప్రభావం ప్రజల్లో పడకుండా, ప్రతిపక్ష నాయకులు మైక్ ముందుకు రాగానే నిమిషాల గ్యాప్‌లోనే సోషల్ మీడియా, టీవీ డిబేట్ల ద్వారా ఘాటైన కౌంటర్లు ఇవ్వాలని అమిత్ షా పార్టీ నేతలను ఆదేశించినట్లు చెబుతున్నారు.

మరోవైపు యూపీ, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ విపక్షాలు ఈ ర్యాలీ ద్వారా రాజకీయ మైలేజ్ పొందకుండా బీజేపీ డేగకన్ను వేసింది. అటు ప్రత్యర్థుల ర్యాలీని టార్గెట్ చేస్తూనే, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో డిజిటల్ మాధ్యమాలపై పూర్తి పట్టు సాధించేలా అమిత్ షా నేతృత్వంలో బీజేపీ పక్కాగా చక్రం తిప్పుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#Amit Shah#Amit Shah Latest News#Amit Shah BJP Meeting#Amit Shah Political Strategy#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి