National

Dhanush: రాజకీయాల్లోకి ధనుష్‌ అడుగులు.. విజయ్‌ను చూసి తొందరపడుతున్నాడా?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

Dhanush: తమిళనాడు రాజకీయాల్లో సినిమా హీరోల ఎంట్రీ అనేది కొత్తేమీ కాదు కానీ.. ఇప్పుడు కోలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనం కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

Dhanush: తమిళనాడు రాజకీయాల్లో సినిమా హీరోల ఎంట్రీ అనేది కొత్తేమీ కాదు కానీ.. ఇప్పుడు కోలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనం కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీతో రచ్చ లేపుతూ క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్తుంటే.. ఇప్పుడు ఆయన బాటలోనే మరో స్టార్ హీరో ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీకి చకచకా పావులు కదుపుతున్నారు. అయితే, విజయ్ వేస్తున్న అడుగులను చూసి ధనుష్ కూడా అనవసరంగా తొందరపడుతున్నాడా? కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి దూకడం కరెక్టేనా? అనే సరికొత్త చర్చ ఇప్పుడు చెన్నై వీధుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గత వారం ఢిల్లీలో పలువురు కీలక రాజకీయ నేతలతో రహస్య భేటీలు జరిపిన ధనుష్.. తాజాగా చెన్నై వేదికగా చేపట్టిన కార్యక్రమం చూస్తే ఆయన పొలిటికల్ స్కెచ్ ఎంత పక్కాగా ఉందో అర్థమవుతోంది. చెన్నై సమీపంలోని చోళింగనల్లూరు జేబీఆర్ కాలేజీ ప్రాంగణంలో ఏకంగా 58 జిల్లాల నుంచి సుమారు 2,500 మందికి పైగా మహిళా అభిమాన సంఘాల లీడర్లతో ఆయన ఒక భారీ మీటింగ్ పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వారితో ముఖాముఖి మాట్లాడటం, ఫోటో సెషన్లు నిర్వహించడం మామూలు సినిమా ఈవెంట్ లాగా అస్సలు లేదు. సాధారణంగా తమిళనాడులో మహిళా ఓటు బ్యాంకు ఎటు మొగ్గితే అధికారం అటే వెళ్తుంది. ఇది ఎంజీఆర్, జయలలితల కాలం నుంచి వస్తున్న పక్కా లెక్క. ధనుష్ కూడా నేరుగా ఆ మహిళా ఓటు బ్యాంక్‌నే టార్గెట్ చేస్తూ మొదటి అడుగే ఇంత వ్యూహాత్మకంగా వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కానీ, ఇక్కడే సినీ, రాజకీయ విశ్లేషకులు ఒక పెద్ద డౌట్ లేవనెత్తుతున్నారు. విజయ్ విషయానికొస్తే.. ఆయన దాదాపు దశాబ్ద కాలంగా తన అభిమాన సంఘాలను ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో ప్రజాసేవలో నడిపించారు, ఆ తర్వాతే పక్కా ప్లానింగ్‌తో పార్టీ పెట్టారు. పైగా విజయ్ తన సినీ కెరీర్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగారు. మరి ధనుష్ కూడా విజయ్ సాధిస్తున్న పొలిటికల్ మైలేజ్ చూసి తొందరపడి రేసులోకి దూకుతున్నారా అన్నది ప్రశ్న. అయితే ధనుష్ ప్లాన్ వేరేలా ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తక్షణమే ఎన్నికల్లో పోటీ చేయడం కాకుండా.. 2031 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ పెట్టుకుని, ఇప్పటినుంచే గ్రౌండ్‌లో సైలెంట్‌గా పునాది నిర్మించుకోవడానికే ఆయన రంగంలోకి దిగినట్లు సమాచారం. విజయ్ వేగాన్ని చూసి ధనుష్ నిజంగానే తొందరపడుతున్నాడా.. లేక ద్రవిడ గడ్డపై మరో కొత్త చరిత్ర సృష్టించడానికి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడా అన్నది కాలమే తేల్చాలి.

#Dhanush#Actor Dhanush#Dhanush Latest News#Dhanush Political Entry#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి