సినిమా

South Cinema: కాప్ స్టోరీస్‌కి మంచి క్రేజ్ అండ్ డిమాండ్

రచన: Anshu••4 నిమిషాల పఠనం

South Cinema: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో కాప్ స్టోరీస్‌కి ఎప్పుడూ మంచి డిమాండ్ అండ్ ఆడియన్స్‌లో క్రేజ్ ఉంటుంది. హీరోలను పోలీస్ పాత్రలో చూడటం అభిమానులకు ఎంత ఆసక్తో..దర్శకులు అంతకన్నా రెట్టింపు ఆసక్తి చూపిస్తున్నారు. తమిళంలో సూర్య సింగం సిరీస్‌తో వరుసగా హిట్స్ అందుకున్నాడు. తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ విక్రమార్కుడు, క్రాక్ సినిమాలతో సాలీడ్ హిట్స్ అందుకున్నాడు. బాలయ్యకి ఈ జానర్ సినిమాలు వర్కౌట్ అయ్యాయి. హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా హిట్ కొట్టినవాళ్ళే.

పోలీస్ స్టోరీ ఇన్స్‌పిరేషన్:

డైలాగ్ కింగ్ సాయి కుమార్ హీరోగా థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో సత్య ప్రకాష్ విలన్‌గా నటించిన పోలీస్ స్టోరీ ఒక సంచనలం అని చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు. సాయి కుమార్ అప్పటి వరకూ చేసిన చిన్న పాత్రలు..హీరో ఇమేజ్ అస్సలు లేదు. కానీ, పోలీస్ స్టోరీ మాత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇన్స్‌పిరేషన్ తో చాలా వచ్చాయి. అయితే, దీనికి ముందు డా.రాజశేఖర్ చేసిన అంకుశం ఆయన కెరీర్లోనే మైల్ స్టోన్ మూవీ.

కర్తవ్యంతో విజయశాంతికి భారీ హిట్..

అప్పటి వరకూ మన తెలుగుతో పాటు ఇతర భాషల్లో హీరోలే పోలీస్ ఆఫీసర్స్‌గా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపారు. కానీ, కర్తవ్యం సినిమాతో కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ సినిమాతో విజయశాంతి లేడీ సూపర్ స్టార్‌గా మారారు. విజయశాంతి చేసిన కర్తవ్యం సినిమాను ఇన్స్‌పిరేషన్ గా తీసుకొని ఆ తర్వాత ఖుష్బూ, వాణి విశ్వనాథ్ లాంటి వారు పోలీస్ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

ఐపీఎస్ నిత్యరెడ్డిగా సాయి పల్లవి:

ఇప్పటి వరకూ ఫిదా బ్యూటీగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సాయి పల్లవి. ఇప్పుడు రామాయణ సినిమాలో సీతగా అలరించడానికి రెడీ అవుతోంది. ఇంతలోనే, మరో ఛాలెంజింగ్ రోల్‌తో మన ముందుకు రాబోతుండటం విశేషం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఓం. ఇందులో, సాయి పల్లవి ఐపీఎస్ నిత్యరెడ్డి గా నటిస్తోంది. తాజాగా, ఈ పాత్రను రివీల్ చేస్తూ సాయి పల్లవి లుక్‌ను రిలీజ్ చేశారు. చూస్తుంటే, ఓం మూవీలో ఆమె పాత్ర ఎంతో ఛాలెంజింగ్‌గా ఉండేలా కనిపిస్తోంది.

#Raviteja#Sai Kumar#Suriya#Vijayashanthi#Sai Pallavi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి