Health

Health: ఈ పువ్వులతో చేసిన టీ తాగితే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో!!..

రచన: Venu4 నిమిషాల పఠనం

మన పెరట్లో, దారి పక్కన కనిపించే నీలిరంగు శంఖం పువ్వులు మనందరికీ సుపరిచితమే. శంఖం ఆకారంలో ఉండటం వల్ల వీటిని శంఖం పువ్వులు అని, ఇంగ్లీష్ లో బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్ అని పిలుస్తారు.

మన పెరట్లో, దారి పక్కన కనిపించే నీలిరంగు శంఖం పువ్వులు మనందరికీ సుపరిచితమే. శంఖం ఆకారంలో ఉండటం వల్ల వీటిని శంఖం పువ్వులు అని, ఇంగ్లీష్ లో బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్ అని పిలుస్తారు. పూర్వకాలం నుండి మన ఆయుర్వేద వైద్యంలోనూ, సంప్రదాయ గృహ వైద్యంలోనూ ఈ పువ్వులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక సాధారణంగా దేవుడి పూజలకు మాత్రమే వాడతామని అనుకునే ఈ పువ్వుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి..

ఇవి కేవలం ప్రకృతి అందించిన అందమైన పువ్వులు మాత్రమే కాదు, శరీరానికి పునరుజ్జీవాన్ని ఇచ్చే ఒక సహజసిద్ధమైన మూలిక.. అలాంటి శంఖం పువ్వులతో చేసే బ్లూ టీ కేవలం చూడటానికి అందంగా ఉండడమే కాదు, ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన వరంగా భావిస్తారు. అలాంటి శంఖం టీ తాగడం వల్ల కలిగే సైంటిఫిక్ ఆరోగ్య లాభాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మొదటిది.. శంఖం పువ్వుల్లో ఆంథోసయనిన్లు అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, రోగనిరోధక శక్తినిపెంచడానికి దోహదపడతాయని చెబుతారు.

రెండవది.. ఈ టీ తాగడం వల్ల మెదడు కణాలు ఉత్తేజితమై, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రోజంతా ఉండే మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని అంటారు..

మూడవది.. శంఖం టీలోని ప్రత్యేక గుణాలు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడి, నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాకుండా, తలలో రక్తప్రసరణను పెంచి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది..

నాలుగవది.. ఈ టీ మన శరీరంలోని జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప కెఫిన్-ఫ్రీ నాచురల్ డ్రింక్ గా పేర్కొంటారు..

ఐదవది.. శంఖం పువ్వుల టీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచి, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని అంటారు. ఇక ఈ టీ తయారీ విధానం చాలా సులభం. కొద్దిగా నీటిని మరిగించి, అందులో నాలుగు లేదా ఐదు ఎండిన లేదా తాజా శంఖం పువ్వులు వేసి ఐదు నిమిషాలు ఉంచితే నీరు నీలిరంగులోకి మారుతుంది. దీనిని అలాగే తాగవచ్చు లేదా కొద్దిగా తేనె కలిపి.. లేదా కొన్ని నిమ్మరసం చుక్కలు కలిపి కూడా తీసుకోవచ్చు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#Butterfly Pea Flowers#Tea#Benefits#Drinking#Blood#glucose
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి