సినిమా

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ..రీల్ లైఫ్‌లోనూ తండ్రిగా బాలయ్య!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Nandamuri Mokshagna: గత నాలుగైదేళ్ళుగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, ఏదో ఒక కారణం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. పైగా అప్పట్లో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండేవాడు. హీరోగా పరిచయం కాబోతున్నాడు..అని వార్తలు వస్తున్నా కూడా తన ఫిజిక్ చూస్తే సినిమాలపై ఆసక్తి లేదని చెప్పుకున్నారు. ఎట్టకేలకి, మోక్షజ్ఞ ఎంట్రీ కన్‌ఫర్మ్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దసరాకి ఈ ప్రాజెక్ట్ గ్రాండ్‌గా ఓపెనింగ్ జరగనుందని సమాచారం.

మోక్షజ్ఞ డెబ్యూకి పలువురు దర్శకులు:

బాలయ్య తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత బోయపాటి శ్రీను, వి.వి.వినాయక్, పూరి జగన్నాధ్, ప్రశాంత్ వర్మ, అనిల్ రావిపూడి..ఇలా చాలామంది దర్శకుల పేర్లు పరిశీలించారు. కానీ, ఫైనల్‌గా నందమూరి కళ్యాణ్ రామ్ కి బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మల్లిడి వశిష్టను ఎంపిక చేశాడు. మోక్షజ్ఞ మొదటి సినిమాను ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడు.

తనయుడితో తండ్రి కూడా?

మోక్షజ్ఞ మొదటి సినిమాలో బాలయ్య కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టుగా ఓ తాజా వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. కథలో తండ్రి పాత్ర నిడివి బాగానే ఉంటుందట. సెకండాఫ్ లో ఈ పాత్ర ఎంట్రీ ఉంటుందని..మోక్షజ్ఞకి తండ్రిగానే బాలయ్య కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య తండ్రి నందమూరి తారకరామారావుతో కలిసి పలు అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. స్వయంగా బాలయకి ఆయనే మేకప్ చేసేవారు.

అదే పద్ధతిని ఇప్పుడు బాలయ్య కూడా తన కొడుకు మోక్షజ్ఞ విషయంలో అనుసరించనున్నారు. సినిమాకి ముహూర్తం పెట్టే దగ్గర్నుంచి మొదటి మేకప్..సినిమా ఓపెనింగ్ డేట్..రిలీజ్ డేట్..ఇలా అన్నిటికీ బాలయ్యే ముహూర్తం పెట్టనున్నారు. ఇక, కథ కూడా సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే విధంగానే సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంచనాలను సృష్టిస్తుందో చూడాలి. కాగా, మోక్షజ్ఞ సరసన హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైనట్టుగా సమాచారం.

#Nandamuri Balakrishna#Nandamuri Mokshagna#Mallidi Vasishtha#Mythri Movie Makers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి