క్రైమ్

TG : గణపయ్య కోసం బాహబాహీ.. ఒకరు మృతి

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయకచవితి పండుగ సందర్భంగా గణపయ్య విగ్రహం కోసం జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు.ఈ ఘటన ఘట్‌కేసర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయకచవితి పండుగ సందర్భంగా గణపయ్య విగ్రహం కోసం జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు.ఈ ఘటన ఘట్‌కేసర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..చౌదరిగూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఆదివారం అర్ధరాత్రి వినాయక విగ్రహం కొనుగోలు చేసేందుకు జోడిమెట్ల సమీపంలోని వినాయక విగ్రహాల షెడ్డు వద్దకు వెళ్లారు.

అక్కడ విగ్రహాలు విక్రయిస్తున్న వ్యాపారులతో ధర విషయంలో వాగ్వాదం నెలకొంది.మాటమాట పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.ఈ ఘర్షణలో విగ్రహాలు విక్రయిస్తున్న రాజస్థాన్‌కు చెందిన చోగారామ్‌ అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో అక్కడే ఉన్న చొగారామ్ కుటుంబ సభ్యులు, మరికొంతమంది మూకుమ్మడిగా ఎదురు దాడికి దిగారు. వ్యాపారుల దాడిలో చౌదరిగూడకు చెందిన పసులాది కిరణ్‌ (34)కు తీవ్రగాయాలయ్యాయి.

అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం స్థానికంగా ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. కిరణ్‌ మృతి చెందడంతో దాడికి పాల్పడిన వినాయక విగ్రహ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చౌదరిగూడ వాసులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై అర్దరాత్రి ఆందోళన చేపట్టారు.

దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళన చేపట్టిన వారికి సర్జిచెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

#vinayakachavithi#statue#price#swechaanews#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి