తెలంగాణ

కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు సైఫాబాద్ పోలీసుల నోటీసులు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈనెల 7వ తేదీన గేట్ నంబర్-3 వద్ద చోటుచేసుకున్న నిరసన ఘటనలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ కుంబాల మహేందర్ రెడ్డి, పీఆర్వో మాణిక్య మహేష్‌లకు సైఫాబాద్ పోలీసులు విచారణాధికారి ఎదుట హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు.

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈనెల 7వ తేదీన గేట్ నంబర్-3 వద్ద చోటుచేసుకున్న నిరసన ఘటనలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ కుంబాల మహేందర్ రెడ్డి, పీఆర్వో మాణిక్య మహేష్‌లకు సైఫాబాద్ పోలీసులు విచారణాధికారి ఎదుట హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడటం, అధికారులను అడ్డుకున్నారన్న ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసిన క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టారు.

 అసెంబ్లీ గేట్ వద్ద నిరసన సమయంలో చోటుచేసుకున్న తోపులాట ఘటనపై కేసు నమోదు కావడంతో, మహేందర్ రెడ్డి, మహేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వీరిద్దరిపై అరెస్ట్ వంటి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఊరట ఇచ్చింది. అదే సమయంలో కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది.

 హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే సైఫాబాద్ సబ్-ఇన్‌స్పెక్టర్ దర్యాప్తు వేగవంతం చేస్తూ నోటీసులు ఇచ్చారు. సెప్టెంబర్ 14న ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారి ముందు హాజరై వాంగ్మూలం నమోదు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతుందని, దానికి కట్టుబడి ఉంటూ విచారణాధికారులకు పూర్తి సమాచారం అందించాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల అరెస్ట్‌ల పరిణామాలతో పాటు కేటీఆర్ వ్యక్తిగత సిబ్బందిపై కూడా కేసులు మరియు నోటీసుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

#KTR#BRSTelangana#SaifabadPolice#AssemblyGate3Protest#MahenderReddy#PROMahesh#TelanganaPolitics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి